
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (APSFTVTDC) నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మరియు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. సంస్థ ఛైర్మన్గా పి.భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియమితులయ్యారు. వీరితో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సుమన్ తల్వార్, ఎస్.శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, వై.ఝాన్సీ, వివేక్ కూచిభొట్ల, వి.సముద్ర, కే.ఉమామహేశ్వర రావు, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ. సత్యనారాయణ, ఎస్.వెంకట కృష్ణారెడ్డి, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి.సత్యనారాయణలను డైరెక్టర్లుగా (సభ్యులు) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


