“త్రికాల” చిత్ర రివ్యూ

చాగంటి ప్రొడక్షన్స్ సమర్పణలో రాధిక శ్రీనివాస్ నిర్మాతగా మణి తెల్లగుంటి దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం త్రికాల. పవన్ చెన్నమట గ్రఫీ చేసిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించగా రిత్విక్ సిద్ధార్థ్ సమర్పించారు. ఈ చిత్రానికి శ్రీసాయి దీప్ చెట్ల, వెంకట రమేష్ దాడి, ఓంకార్ పవన్ నిర్మాతలుగా వ్యవహరించగా శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, ఆమని అజయ్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
“కుమారి ఖండం”లో దాచిన ప్రాచీన రహస్యాలను కాపాడేందుకు సృష్టించిన వీరుడు త్రికాల వర్మ ఆత్మ, కలియుగంలో అసుర శక్తులు మళ్లీ మేల్కొనడంతో తిరిగి యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో తన ప్రేయసి కోసం వెతుకుతున్న శివ, ఈ మిస్టరీతో అనుబంధం ఉన్న వైతరణ్ అనే వ్యక్తి ద్వారా భయానక సంఘటనల్లో చిక్కుకుంటాడు. చివరకు అసుర శక్తులపై జరిగే పోరాటమే కథ.

నటీనటుల నటన :
‘వైతరణ్’ సినిమాలో అజయ్ పోషించిన సూర్యకాంతిని తట్టుకోలేని వ్యక్తి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రత్యేకమైన మాస్క్‌లు, డార్క్ విజువల్స్‌తో ఆయన పాత్ర చాలా కొత్తగా కనిపించింది. హీరో మాస్టర్ మహేంద్రన్ అమాయకత్వం నుంచి భావోద్వేగాల వరకు నేచురల్‌గా నటించి ఆకట్టుకున్నాడు. శ్రద్ధా దాస్ సైకియాట్రిస్ట్ పాత్రలో మిస్టరీతో కూడిన కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాకు ప్రత్యేకమైన డార్క్ టోన్ తీసుకొచ్చింది. సీనియర్ నటి ఆమని తన అనుభవంతో తల్లితనం, భయం, బాధ వంటి భావోద్వేగాలను సహజంగా చూపించి కథకు ఎమోషనల్ బలం ఇచ్చింది.

సాంకేతిక విశ్లేషణ :
దర్శకుడు మణి తెల్లగూటి ‘త్రికాల’ను టెక్నికల్‌గా ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కథ దశ నుంచే ప్రతి ఫ్రేమ్‌ను డార్క్ విజువల్ స్టైల్‌తో డిజైన్ చేసి, మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకాలజికల్ హారర్ అంశాలను ఆసక్తికరంగా చూపించారు. పవన్ చెన్నా సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌కు ప్రత్యేకమైన భావోద్వేగాన్ని తీసుకొచ్చింది. హర్షవర్ధన్ రామేశ్వరం సంగీతం, షాజిత్ హుమాయున్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ సన్నివేశాలకు మరింత ప్రభావం తీసుకొచ్చాయి. అలాగే VFXను కథలో సహజంగా మిళితం చేసి, మాయా ప్రపంచాలు మరియు ఆధ్యాత్మిక యుద్ధాలను రిచ్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా చూపించారు.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, బిజిఎం

మైనస్ పాయింట్స్ :
VFX, కొన్ని సన్నివేశాలు

సారాంశం :
‘త్రికాల’ పౌరాణిక రహస్యాలు, కర్మ సిద్ధాంతం, డార్క్ ఫాంటసీ, హాలీవుడ్ స్థాయి విజువల్స్ కలయికగా రూపొందిన సినిమా. ఆధ్యాత్మిక కాన్సెప్ట్స్‌తో కూడిన డార్క్ విజువల్ అనుభూతిని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది కొత్త అనుభవాన్ని అందిస్తుంది.

Related Articles

Latest Articles