‘పెద్ది’లో ప్రస్తావించిన కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు

‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా వినిపించే పేరు కోడి రామ్మూర్తి నాయుడు. ఇందులో శివకుమార్ పాత్రను ఆయన శిష్యుడిగా చూపించడం విశేషం. ప్రపంచ ఖ్యాతి గాంచిన భారతీయ బలవంతుడు, మల్లయోధుడు అయిన కోడి రామ్మూర్తి నాయుడు తన అసాధారణ శారీరక దృఢత్వంతో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.

తన గుండెలపై ఏనుగును ఎక్కించుకోవడం, ఇనుప గొలుసులను ఛాతీ కండరాలతో తెంచడం, రెండు దిశల్లో కదిలే కార్లను చేతులతో ఆపడం వంటి అద్భుత విన్యాసాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆయన ప్రతిభను మెచ్చిన బ్రిటన్ రాజు ఐదవ జార్జ్ “ఇండియన్ హెర్క్యులస్” బిరుదుతో సత్కరించగా, భారతీయులు ఆయనను “కలియుగ భీముడు”గా గౌరవించారు.

గొప్ప బలశాలిగా మాత్రమే కాకుండా, దేశభక్తుడిగా కూడా రామ్మూర్తి నాయుడు పేరు తెచ్చుకున్నారు. తన ప్రదర్శనల ద్వారా సంపాదించిన ధనంలో భాగాన్ని స్వాతంత్ర్య సమరయోధులకు విరాళంగా అందించారు.

అలాంటి మహానుభావుడి స్ఫూర్తిని ఆధారంగా చేసుకుని ఆయన గొప్పతనాన్ని కొత్త తరానికి పరిచయం చేసినందుకు ‘పెద్ది’ దర్శకుడు కు ప్రత్యేక అభినందనలు దక్కుతున్నాయి.

Related Articles

Latest Articles