3 రోజుల్లో రూ.236.7 కోట్ల వసూళ్లు – బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘పెద్ది’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి డబుల్ సెంచరీ క్లబ్‌లోకి చేరింది.

దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లో కూడా చిత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తూ 2.6 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకుల ఆదరణ ఎంతగా ఉందో బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే 4.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం ద్వారా స్పష్టమైంది.

మాస్, యువత, కుటుంబ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటున్న ‘పెద్ది’ భావోద్వేగ కథనం, బలమైన పాత్రలు, సందేశాత్మక అంశాలతో విశేష ప్రశంసలు అందుకుంటోంది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా నమోదవుతుండటంతో వీకెండ్ ముగిసే సరికి వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ విజయంతో ‘పెద్ది’ రామ్ చరణ్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది.

Related Articles

Latest Articles