
ఇటీవల మీడియా ద్వారా తన అభిమాని 17 ఏళ్ల బాలుడు నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతూ తనకు పవన్ కళ్యాణ్ ను కలవాలని ఉందని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన అతడిని కలిసి, కాస్త సమయాన్ని తనతో గడపడం జరిగింది. అలాగే తాను OG2 సినిమాను గాని తీస్తే ఆ బాలుడు ఆ సినిమాకు గెస్ట్ అని, తనతో కలిసి OG2 చూస్తానని ఆ బాలుడికి మాటిచ్చారు. ఒక అరుదైన వ్యాధి వల్ల బాధపడుతున్న ఆ బాలుడికి ధైర్యాన్ని ఇచ్చి, తనకు అండగా నిలబడతానని అన్నారు. దీనికి సహకరించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పోలీసు డిపార్ట్మెంట్కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని, భక్తుడు నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గారు తన అభిమానికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ తమ కుటుంబానికి తన నిర్మాణ సంస్థ అయినటువంటి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నుండి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.


