‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు… నేటి నుంచి థియేటర్లలో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం మూడో వారంలోకి మరింత బలంగా అడుగుపెడుతోంది.

ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు నేటి నుంచి సినిమాలో కొత్త సన్నివేశాలను జోడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొత్తం 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త ఫుటేజ్‌ను చిత్రంలో చేర్చనున్నారు.

అలాగే గురువారం నుంచి ఈ సినిమాను సాధారణ టికెట్ ధరలతో ప్రదర్శించనుండటం విశేషం. దీంతో కుటుంబ ప్రేక్షకులు సహా మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది.

దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన మౌత్ టాక్, భారీ వసూళ్లతో 2026లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. అలాగే రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘పెద్ది’ రికార్డు సృష్టించింది.

Related Articles

Latest Articles