
శ్రీరామ్ ఎరగాం దర్శకత్వంలో జియో హాట్‌స్టార్ వేదికగా గతంలో వచ్చిన సేవ్ ది టైగర్స్ రెండు సీజన్స్ అద్భుతమైన ప్రేక్షక ఆదరణతో ఇప్పుడు మరొక సీజన్ రావడం జరిగింది. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటర్స్ గా జియో హాట్‌స్టార్ వేదికగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, వెన్నెల కిషోర్, జోర్డార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే…
కథ :
గతంలో వచ్చిన రెండు సీజన్ లకు కంటిన్యూగా వచ్చిన ఈ సిరీస్ గత రెండు సీజన్స్ కు కాస్త బిన్నంగా ఉంటుంది. ముందు రెండు సీజన్స్ లో ఉన్న ముగ్గురు ప్రధాన మగవారు వారి కలల జీవితాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని వేరే లోకంలో ఉన్న వారి పారాలెల్ పాత్రలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే అలా వెళ్లిన తర్వాత అక్కడ వారు ఆనందపడతార లేక వారికి అక్కడ కూడా కష్టాలు వస్తాయా? వేరే లోకం నుండి వచ్చిన వారి వల్ల వీరికి ఎటువంటి అనుభవాలు ఎదురౌతాయి? చివరికి వారి జీవితాలు ప్రస్తుత లోకంలో ఉంటాయా లేదా పారలల్ లోకంలో ఉంటాయా? వారికి ఏ జీవితం సంతోషాన్ని ఇస్తుంది? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్ లో చూడాల్సిందే.
నటీనటుల నటన :
గత సీజన్స్ వలే ఈ సీజన్ లో కూడా నటీనటులు అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు. ప్రేక్షకులను కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేయడం దగ్గర నుండి ఎమోషన్స్ వరకు ప్రతి విషయంలో బెస్ట్ ఇచ్చారు. అయితే ఈ సీజన్ లో వెన్నెల కిషోర్ పాత్ర మరింత బలాన్ని చేకూర్చింది. అలాగే గంగవ్వ ఇంకా ఇతర నటీనటులు పాత్రలు ఈ సీజన్ లో కీలకంగా కనిపించాయి. అయితే పర్ఫార్మెన్స్ విషయంలో ప్రతి ఒక్కరూ పోటాపోటీగా నటించారు.
సాంకేతిక విశ్లేషణ :
ఈ కథ గత సీజన్స్ తో పోలిస్తే కాస్త బిన్నంగా ఉంటుంది. మొదటి ఎపిసోడ్ కాస్త గజిబిజిగా ఉన్నప్పటికీ రెండవ ఎపిసోడ్ నుండి ప్రేక్షకులు పూర్తిగా ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగుతుంది. అలాగే కలతోపాటు సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో ఉపయోగించిన విఎఫ్ఎక్స్ ఇంకా గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత బాగా సూట్ అయింది. అలాగే కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటులు నటన, మలుపులు.
మైనస్ పాయింట్స్ :
మొదటి ఎపిసోడ్ కాస్త గజిబిజిగా ఉండటం.
సారాంశం :
గత సీజన్స్ తో పోలిస్తే ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో మొలుకులతో సీ టచ్ థ్రిల్లర్ గా జియో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 3.


