ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

నటుడు ప్రకాష్ రాజ్ కు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది.

2019లో న్యాయవాది దిలీప్ కుమార్, ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేర్వేరు ఓటరు కార్డులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.

కేసు విచారణకు హాజరుకావాలంటూ కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా, ప్రకాశ్ రాజ్ హాజరుకాలేదని పేర్కొంటూ బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Related Articles

Latest Articles