
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా “సర్కారు బాయి”. ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను దర్శకుడు లారా కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తెలంగాణ పల్లె యువకుడిగా ఎంతో సహజంగా శ్రీరామ్ నిమ్మల కనిపిస్తున్నారు. “సర్కారు బాయి” సినిమా హీరోగా, నటుడిగా ఆయనకు మంచి పేరు తెస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
ప్రస్తుతం “సర్కారు బాయి” సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి అనే ఊరిలో “సర్కారు బాయి” చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ లెంగ్తీ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల, హీరోయిన్ వర్షిక, ముఖ్య నటీనటులు బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్ లపై సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. జూలై నెలాఖరు వరకు ఈ భారీ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
నటీనటులు – శ్రీరామ్ నిమ్మల, వర్షిక, బాహుబలి ప్రభాకర్, వివ రెడ్డి, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ, తదితరులు
టెక్నికల్ టీం :
డీవోపీ – అమర్.జిమ్యూజిక్ – కె. శివఎడిటర్ – బి.యన్.రెడ్డిపబ్లిసిటీ డిజైనర్ – వివారెడ్డిమేనేజర్ – మధు.సి.హెచ్కాస్ట్యూమ్ డిజైనర్: కె. మాధురినిర్మాత: తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డిరచన, దర్శకత్వం: లారా


