
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు జై బి శ్రీనివాస్ ను తెలుగుదేశం పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న జై బి శ్రీనివాస్‌ను తాతయిగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ హరీష్ కుమార్, సురక్ష ఇన్ఫ్రా చైర్మన్ వర్మ, నందకుమార్, హర్ష తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ మరింత బలోపేతం అయ్యేలా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన జై బి శ్రీనివాస్, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.


