
విక్టరీ వెంకటేష్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందిన తర్వాత, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ చిత్ర బృందం కుటుంబంలోని మరో సభ్యురాలిని పరిచయం చేసింది.
ఈ చిత్రంలో చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది.
పాత్రల పరిచయాలతో సినిమాపై రోజురోజుకూ ఆసక్తిని పెంచుతున్న మేకర్స్, తదుపరి ‘సర్వ’ పాత్రలో నటిస్తున్న రాజా ప్రజ్వల్‌ను పరిచయం చేయనున్నారు.
రచన,దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి. కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.


