
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు “కిల్లర్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
“కిల్లర్” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే అక్టోబర్ 17న మన దేశపు గొప్ప సైంటిస్ట్ డా.పూర్వజ్ ను ఏలియన్స్ కాంటాక్ట్ అవుతారు. ఒక స్పేస్ షిప్ ను భూమికి పంపిస్తున్నట్లు తెలియజేస్తారు. ఈ విషయాన్ని మిగతా వారికీ చెప్పమని, తాము మానవులను రక్షించాలని అనుకుంటున్నట్లు ఆ ఏలియన్ డా.పూర్వజ్ కు చెబుతుంది. మన భవిష్యత్, ఆ ఏలియన్ కు గతం. ఇలా మరో కాలం నుంచి వస్తున్న ఆ ఏలియన్ డా.పూర్వజ్ ను ఎందుకు కాంటాక్ట్ అయ్యింది ?, స్పేస్ షిప్ ను భూమికి ఎందుకు పంపించాలనుకుంది ?, మానవాళికి ఏర్పడిన ముప్పు ఏంటి ?, ఆ ఏలియన్ చేయాలనుకున్న సాయం ఏంటి ? వంటి ప్రశ్నలతో రిలీజ్ డేట్ గ్లింప్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ‘అక్టోబర్ 17న మీ భవితను నిర్ణయిస్తాం..’ అంటూ గ్లింప్స్ చివరలో వేసిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
ఓవర్సీస్ లో “కిల్లర్” మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ “కిల్లర్” సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది.
నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ ( జి.ఎస్. మీడియా )


