అమెజాన్‌ ప్రైమ్‌లో ‘హుషార్‌ పిట్టలు’

ఇటీవల థియేటర్‌లో విడుదలైన చిన్నచిత్రం ‘హుషార్‌ పిట్టలు’. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించారు. యూత్‌ఫుల్‌ అంశాలతో పాటు ఎమోషనల్‌ అంశాలతో ఇటు యూత్‌ను, అటు ఫ్యామిలీస్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా అమోజన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్‌లో మిస్‌ అయిన ఆడియన్స్‌ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.
అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన ఈ యూత్‌ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించాడు.ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. సురేష్‌ ఏషియన్‌ ఫిలిమ్‌ సంస్థలు ఈ చిత్రాన్ని థ్రియేటికల్ విడుదల చేశారు. థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయం అందించిన ప్రేక్షకులు ఓటీటీలో కూడా మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నానని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles