
చంద్ర సిద్ధార్థ్ దర్శకునిగా వచ్చిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి’. దీనికి క్యాప్షన్ ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’. ఫిల్మోత్సవ్ బ్యానర్ పై ఆయనే సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
1995 నాటి సమయంలో జరిగిన కథగా ఈ సినిమా ఉంటుంది. మతి తప్పిన ఒక ధనవంతుడైన యువకుడు ఒక గ్రామంలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తనకు అదే గ్రామంలో ఒక జంట పరిచయం అయితే వారితో చాలా సరదాగా ఉంటాడు. ఇది ఇలా ఉండగా తన గతానికి సంబంధించి కొన్ని సంఘటనలు తనకు రిపీట్ గా వినిపిస్తూ ఉంటుంది. అసలు అతను గతం మర్చిపోవడానికి కారణం ఏంటి? తన గత జీవితం ఏంటి? తనను ఎవరైనా మోసం చేశారా లేక తానే యాక్సిడెంట్లుగా మర్చిపోయారా? సైకలాజికల్ గా తనను వెంబడిస్తున్న ఆ పాట ఏంటి? ఆ పాటకు ఇతనికి సంబంధం ఏంటి? అసలు మెదడులో నుండి కొంత గతాన్ని మరిచిపోవడం లేదా మర్చిపోయాలా చేయడం సాధ్యమేనా? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ సినిమాని చూడాల్సిందే.
నటీనటులు నటన :
ఈ సినిమాతో పరిచయం అవుతున్న హర్ష (నందు & సాగర్) తొలి చిత్రం అయినప్పటికీ చాలా స్టేబుల్ గా నటిస్తూ కనిపించారు. ఒకవైపు నుండి కాస్త అన్ బాలన్స్ మనిషిలా కనిపిస్తూనే మరోవైపు నుండి మనుషులకు ఎంతో విలువ ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తారు. గతంలో కొన్ని సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన రేఖ నిరోష (నీలి) గ్రామీణ అమ్మాయి లాగా చాలా బాగా నటించారు. ముఖ్యంగా అల్లరి చేస్తూ ఆమె ప్రేక్షకులను మరింత మెప్పించారు. ఈ చిత్రంలో మరొక కీలకపాత్ర పోషించిన వ్యక్తి రవివర్మ (డా. శివాజీ) ఒక డాక్టర్ పాత్రలో అలాగే హీరోకు అన్నయ్యగా పగ చదువుకున్న వ్యక్తుల కనిపిస్తూనే తన సొంత ఊరితో పెద్దగా ఎమోషన్ లేని పాత్రలో మెప్పించారు. సినిమాలో హీరోయిన్గా నటించిన అమైరా గోస్వామి(రమా) తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను ఎమోషనల్ గా బాగా మెప్పించారు. అశోక్ వర్ధన్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే చిత్రంలో ఇతర పాత్రలలో కనిపించిన నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్ గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
ఒక మిస్టీరియస్ సైకలాజికల్ కథను విభిన్నమైన రీతిలో చూపించడంలో దర్శకుడు కొంతవరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంగీతానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ తో ఉండటంతో పాటలు బాగా రావడంలో సంగీత దర్శకుడు మంచి జాగ్రత్త తీసుకున్నట్లు అర్థమవుతుంది. లొకేషన్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు పరవాలేదు. విఎఫ్ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, పాటలు, నటీనటుల నటన
మైనస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్
సారాంశం :
యదార్థ సినిమాలకు విభిన్నంగా కొత్త మిస్టీరియస్ కథలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇచ్చే చిత్రం ఈ పాటకోరిన వారు నెమలిపాలెం నుండి.


