బిగ్‌బాస్ తెలుగు 10’కు సూపర్బ్ క్రేజ్ – ఇండియాలో టాప్ 10 OTT షోల్లోకి ఎంట్రీ

బిగ్‌బాస్ తెలుగు 10 క్రమంగా జోరు పెంచుకుంటోంది. క్రమంగా ఇండియాలోని టాప్ 10 OTT ప్రాపర్టీస్‌లోకి దూసుకొచ్చింది. సెప్టెంబర్ 7–13 వారానికి నంబర్ 6 స్థానంలో నిలిచి, అంచనా ప్రకారం 43 లక్షల మంది వ్యూస్ ను సొంతం చేసుకుంది.

షోలో వరుసగా చోటుచేసుకుంటున్న ట్విస్టులు, మిడ్-వీక్ ఎలిమినేషన్, పవర్ టాస్కులు, నాగార్జున హోస్ట్ చేస్తున్న వీకెండ్ ఎపిసోడ్స్‌తో పాటు హౌస్‌లో పెరుగుతున్న డ్రామా.. సీజన్‌పై ఆడియన్స్‌లో మరింత బజ్ తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది.

మొత్తంగా ‘బిగ్‌బాస్ తెలుగు 10’ కేవలం టాప్ 10లోకి ఎంటర్ అవ్వడమే కాదు.. సీజన్ ముందుకు సాగుతున్న కొద్దీ హైప్, ఆడియన్స్ ట్రాక్షన్ కూడా క్రమంగా పెరుగుతున్నట్లు ఈ నెంబర్స్ సూచిస్తున్నాయి.

Related Articles

Latest Articles