
తన భార్య మౌనిక భూమా మంచు పుట్టినరోజు సందర్భంగా నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో అత్యంత కష్టమైన సమయాల్లోనూ, తిరిగి నిలబడే ప్రయాణంలోనూ మౌనిక అందించిన అండ, నమ్మకం తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని భావోద్వేగంగా పేర్కొన్నారు.
నమస్తే వరల్డ్, AIKYA ధైర్య సేన సమితి ద్వారా సమాజ సేవలో మౌనిక చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఆమె కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు. తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా AIKYAను ప్రారంభించామని, ఈ ఆలోచన వెనుక ఉన్న అసలైన హృదయం మౌనికేనని తెలిపారు.
తమ కుటుంబం, కలిసి నిర్మించుకున్న అందమైన జీవితానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆమె ఎప్పటికీ తనకు ఎంతో ప్రత్యేకమని, ఆమె కలలకు కుటుంబమంతా అండగా ఉంటుందని పేర్కొంటూ ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు.
https://www.instagram.com/reel/DeD8ypwIP3B/?stkn=d3czY2ZheXl1bDI=


