టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై ముంబైలోని జుహూ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ ఆడి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్‌ ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి సంబంధించి సోషల్‌ మీడియాలో వచ్చిన గ్యాంగ్‌ ప్రమేయం వాదనలను పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటన బాలీవుడ్‌ వర్గాల్లో కలకలం రేపింది.

Related Articles

Latest Articles