“ఆదర్శ కుటుంబం” చిత్ర రివ్యూ

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా తమన్ సంగీతాన్ని అందించారు. నివేత పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, రఘుబాబు తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చేశారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
అతి సాధారణ మధ్యతరగతి బ్యాంక్ ఎంప్లాయి చిట్టిబాబు. తన భార్య కూతురు అలాగే కొడుకుతో ఒక అద్దె ఇంట్లో జీవిస్తాడు. తన భార్య అప్పులు చేస్తూ ఉండగా తాను ఆ చిన్న ఉద్యోగంతోనే కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తారు. ఇది ఇలా ఉండగా అతనికి 100 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుంటారు. ఆ తరువాత వారి స్థాయి అంతా మారిపోతుంది. ఒక పెద్ద విల్లా సొంతంగా తీసుకుని అందులో హై క్లాసులో జీవిస్తూ ఉంటారు. ఇలా ఉండగా వారి కుటుంబంలోకి ఒక అనుకోని సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి? వారి జీవితంలోకి వచ్చిన కొత్త వారు ఎవరు? అసలు లాటరీ నిజంగానే గెలిచారా లేదా? పోలీసులు అలాగే దొంగల వల్ల వారి కుటుంబం ఎటువంటి చాలెంజెస్ ఎదుర్కొంటుంది? చివరికి తన కుటుంబాన్ని చిట్టిబాబు వారి నుండి కాపాడుకుంటారా లేదా? తన కుటుంబ పరిస్థితి చివరికి ఎలాంటి పరిస్థితులలో ఉండబోతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో వెంకటేష్ గారు తన తొలి దిశ నుండి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ లో చాలా న్యాచురల్ గా నటించారు. అటు మిడిల్ క్లాస్ వ్యక్తిగా అలాగే లాటరీ తర్వాత స్థాయి మారిన కోటేశ్వరుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. శ్రీనిధి శెట్టి కూడా ఇదే తరహాలో కనిపిస్తూ చాలా బాగా రెండు ఫేసెస్ బాగా మేనేజ్ చేశారు. వారి పిల్లలుగా నటించిన యువతి, అలాగే చిన్న బాలుడు కూడా తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ సినిమాకు చాలా ప్లస్గా నిలిచారు. ముఖ్యంగా వారి కామెడీ టైమింగ్ అలాగే క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించాయి. అలాగే కొన్ని సీన్స్ లో వారు అమాయకంగా అలాగే మరికొన్ని సీన్స్ లో ఎంతో భయంకరంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నారా రోహిత్ ఒక సిన్సియర్ పోలీస్ పాత్రలో కనిపిస్తూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచుతూ ఉంటారు. రఘుబాబు, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ కామెడీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినిమాలో సందర్భాన్ని బట్టి వచ్చిన డైలాగ్స్ వల్ల కామెడీ టైమింగ్ మరింత అద్భుతంగా ఉంటుంది. నివేత పేతురాజ్ అదే కమ్యూనిటీలోని నైబర్ లా కనిపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. అలాగే సినిమాలో విలన్స్ పాత్రలో కనిపించిన వారంతా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమాలో నటించిన నటనలు అందరూ తమ తమ పాత్రల పరిధిలో కనిపిస్తూ సినిమాకు మరింత ప్లస్ గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
ఈ సినిమా గతంలోని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలతో పోలిస్తే కాస్త కొత్తగా ఉంటుంది. ఒకపక్క ఆయన మార్క్ కనిపిస్తూనే మరోపక్క కొత్త తరహాలో ఈ సినిమా చేసినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్ అద్భుతంగా అనిపించాయి. అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినప్పటికీ సినిమా చాలా బాగుంది. పాటలు, బిజిఎం బాగున్నాయి. అలాగే సినిమాలో మనకు కనిపించే విల్లా చాలా బాగుంది. కమ్యూనిటీ ఇంకా ట్రైన్ చాలా న్యాచురల్ గా అనిపించాయి. కలరింగ్, విఎఫ్ఎక్స్ వంటి ఇతర సాంకేతిక విషయాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, డైలాగ్స్, నటీనటుల నటన, నిర్మాణ విలువలు.

మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం.

సారాంశం :
కుటుంబ సమేతంగా కాస్త ట్విస్టులతో నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే చిత్రం ఆదర్శ కుటుంబం.

Related Articles

Latest Articles