నేను ఫ్యూచర్ లో పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు, ఓ పదేళ్ల తర్వాత నా ప్రొడక్షన్ లో “సమ్మర్ హాలిడేస్” సినిమా వచ్చిందని గుర్తుపెట్టుకుంటాను : ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

  • ఈ కథ విన్నప్పుడు మనసును హత్తుకుంది. నా రియల్ లైఫ్, నా చైల్డ్ హుడ్ మెమొరీస్ గుర్తుకువచ్చాయి. ఈ సినిమాలో అమ్మమ్మ పాత్రలో జయసుధ చెప్పే డైలాగ్స్ మా అమ్మమ్మ చెప్పినట్లు, వాసుకి గారు చెప్పే మాటలు మా అమ్మ చెప్పినట్లు అనిపించాయి. మా అమ్మ అలాగే నాతో మాట్లాడేది. నాతో పాటు ప్రేక్షకులకు కూడా అదే ఫీల్ కలుగుతుందని నమ్మాను. ఈ కథలో చిన్నపిల్లల పాత్రలను టీనేజ్ లోకి మార్చి ఒక లవ్ స్టోరీ పెట్టి కమర్షియల్ గా మార్చవచ్చు. కానీ బాల్యంలో ఉండే ఆ ఇన్నోసెన్స్ పోతుంది. పాత్రల్లోని ఆ సున్నితత్వమే ఈ కథలో కీలకమైంది.
  • మనకు ట్రెండ్ బ్రేక్ చేసే సినిమాలో ఎన్నో వస్తుంటాయి. పెళ్లిచూపులు వంటి సినిమాల తర్వాత మన దగ్గర రొమాంటిక్ కామెడీ మూవీస్ ట్రెండ్ పోయింది అన్నారు. ఆ తర్వాత ప్రేమలు సినిమా తెలుగులో డబ్ అయి ఆదరణ పొందింది. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ వచ్చింది. “సమ్మర్ హాలిడేస్” కథను చెబితే మళ్లీ పిల్లల సినిమాలు ఇండస్ట్రీలో నిర్మిస్తారని, ఆ చిత్రాలకు మా సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మాం. అమ్మమ్మగా నటించిన జయసుధ గారు మొన్న ట్రైలర్ లాంఛ్ కు రావాల్సిఉంది. ఆమె నెక్ట్స్ ఈవెంట్ కు వస్తున్నారు.
  • నేను నమ్మిన కథను బలంగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నా. సమ్మర్ సీజన్ లో మా సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నా కుదరలేదు. ఇప్పుడు రిలీజ్ కుదిరింది కాబట్టి దీపావళి పండక్కి కరెక్టేమో అనిపించింది. ఈ నెల 30న వచ్చే సినిమాలు నవంబర్ 6కు వాయిదా పడతాయని భయపడ్డాం కానీ అవేమీ రావడం లేదు. లక్కీగా మా సినిమాకు దాదాపు సోలో రిలీజ్ దొరికిందని అనుకోవచ్చు. ఒక స్పెషల్ అటెంప్ట్ చేసే చిత్రాలకు, కొత్త నిర్మాతలు తీసే చిన్న చిత్రాలకు, స్థానికంగా రూపొందించే సినిమాలకు ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే థియేటర్స్ నుంచి రెవెన్యూ తగ్గిపోయింది. ఓటీటీలు పెద్ద సినిమాలే తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాకు ప్రభుత్వం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది.
  • మా సినిమాకు నవంబర్ 6న మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. పాజిటివ్ టాక్ మొదలయ్యాక ఇంకా పెరుగుతాయి. మా సినిమాలో మెసేజ్ ఏమీ ఉండదు. మంచి ఎమోషన్స్ ఉంటాయి. పిల్లలు రెండు నెలలు వేసవి సెలవులు గడిపి తిరిగి వెళ్లిపోతుంది అమ్మమ్మ, ఆ ఊరి స్నేహితులు ఎమోషనల్ గా మారడం, అరుణ్, రోహన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్, తండ్రి కొడుకు ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. నేను నిర్మాతగా అవార్డ్స్ ఆశించడం లేదు. థియేటర్స్ కు ప్రేక్షకులు వచ్చి మా సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా.
  • “సమ్మర్ హాలిడేస్” సినిమా వర్కవుట్ అయితే ఇండస్ట్రీలో మరిన్ని ఇలాంటి మంచి చిత్రాలు వస్తాయని నమ్ముతున్నాను. నేను గర్ల్ ఫ్రెండ్ సినిమా నిర్మించినప్పుడు అది అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం కాదు, ఒక సెక్షన్ చూస్తారని నమ్మాను. ఈ తరహా చిత్రాలను కూడా చూసే వాళ్లు ఉంటారు. ఎవరో ఒకరు అడుగు వేస్తేనే కదా మరొకరికి స్ఫూర్తిగా నిలుస్తాం. నేను ఫ్యూచర్ లో పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు, ఓ పదేళ్ల తర్వాత నా ప్రొడక్షన్ లో “సమ్మర్ హాలిడేస్” సినిమా వచ్చిందని గుర్తుపెట్టుకుంటాను. అలాంటి స్పెషల్ ఫిలిం ఇది. రోహన్, అరుణ్ పాత్రల్లో ఎంత సహజత్వం, సున్నితత్వం ఉందో అలాంటి ఇన్నోసెన్స్ , నిజాయితీ మా డైరెక్టర్ లో చూశాను. ఈ కథలో ఏ అంశం కావాలని తీసుకొచ్చినట్లు ఉండదు. మూవ్ మెంట్స్, విజువల్స్ కూడా అంతే సహజంగా తెరకెక్కించాడు.
  • ఈ ఏడాది సినిమాలు మొదటి ఆరునెలలు రిలీజ్ కు రాలేదు. ఇప్పుడు వరదలా వస్తున్నాయి. టీజర్ ల మీద టీజర్ లు, ట్రైలర్స్ మీద ట్రైలర్స్, పాటల మీద పాటలు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులకు కూడా ఏదీ రిజిస్టర్ అయ్యే స్పేస్ ఇవ్వడం లేదు. మన ప్రొడ్యూసర్స్ ముందే ప్లాన్ చేసుకుని ఉంటే ఈ ఇయర్ సెకండాఫ్ లో ఇంతగా సినిమాల రద్దీ ఉండేది కాదు.
  • ప్రస్తుతం మా సంస్థలో సంగీత్ శోభన్, అనస్వరతో అంతా రాములోరు చూస్కుంటారు సినిమా నిర్మిస్తున్నాం. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్ రిలీజ్ అనుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూసి ఫిబ్రవరికి రిలీజ్ మార్చుకున్నాం. ఆ తర్వాత 35 మూవీ డైరెక్టర్ నందకిషోర్ తో ఒక సినిమా, కిష్కిందపురి దర్శకుడు కౌషిక్ తో ఒక సినిమా చేయబోతున్నాను. సంక్రాంతి తర్వాత ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్తాయి.

Related Articles

Latest Articles