గ్రాండ్ గా “సమ్మర్ హాలిడేస్” థ్యాంక్స్ మీట్

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి టాలీవుడ్ కు మరో హిట్ అందించింది “సమ్మర్ హాలిడేస్” సినిమా. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. దర్శకుడు శ్రీకర్ రూపొందించారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటించారు. నిన్న (శుక్రవారం) “సమ్మర్ హాలిడేస్” పిల్లలతో పాటు పెద్దల్ని ఈ సినిమా ఆకట్టుకుంటూ మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్స్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు రమణ భార్గవ్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించినందు కంటే ఇలాంటి మంచి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు ధీరజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ అందరిలాగే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. అన్నారు.

నటి హర్షిణి మాట్లాడుతూ – మనం ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే పాత ఫొటోస్ చూసుకుంటాం. అప్పుడు మంచి ఫీల్ కలుగుతుంది. అలాంటి ఫీల్ మా “సమ్మర్ హాలిడేస్” సినిమా చూసినప్పుడు మీలో కలుగుతుంది. మనం తిరిగి రీఛార్జ్ అవుతాం. మనకోసం మనం చూడాల్సిన సినిమా ఇది. మా సినిమాను థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

నటి వాసుకి మాట్లాడుతూ – ఒక మంచి సినిమా చేస్తున్నామనే నిస్వార్థంతో మా టీమ్ అంతా పనిచేశారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాకు బాక్సాఫీస్ రివార్డ్స్, అవార్డ్స్ ఏవీ ఆశించలేదు. మంచి ఎమోషన్ తో పాటు మెసేజ్ ఉన్న సినిమా చేశాం. ఇలాంటి మంచి టీమ్ చేసిన ప్రయత్నానికి ప్రతి ఒక్కరి అభినందనలు లభించాలని కోరుకుంటున్నా. అన్నారు.

మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ – నేను 35 చిన్న కథ కాదు సినిమా చేస్తున్నప్పుడు, నేషనల్ అవార్డ్ తీసుకుంటున్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. ఇప్పుడు ఈ సినిమాకు భావోద్వేగానికి గురవుతున్నా. మా సినిమా చూసి చాలా మంది ఫోన్ కాల్స్ చేసి అభినందిస్తున్నారు. ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. నేను ఈ వేదిక మీద ఉన్నానంటే అందుకు మా పేరెంట్స్ కారణం. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

మాస్టర్ రోహన్ మాట్లాడుతూ – మన టాలీవుడ్ నుంచి వచ్చిన డైమండ్ లాంటి సినిమా “సమ్మర్ హాలిడేస్”. మనం తమిళ, మలయాళ చిత్రాలను ప్రశంసిస్తూ ఉంటాం. మన దగ్గర కూడా అలాంటి మంచి సినిమా వచ్చింది చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. మీరు సినిమా బాగుందనే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తే ఇంకా ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో మా సినిమాకు వస్తారు. అరుణ్ తో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. త్వరలో నన్ను హీరోగా కూడా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు లాంఛ్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ శ్రీకర్ నయన్ మాట్లాడుతూ – అరుణ్, రోహన్ ను చూస్తుంటే కమల్, రజినీని చూసినట్లు ఉందనే ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది. ఈ మొత్తం జర్నీలో నాకు ఒక ఫ్రెండ్ గా, మెంటార్ గా నిలిచింది మా ధీరజ్. మా సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. మీరు ఎక్కడా డిజప్పాయింట్ కారు. మీ ఫేస్ మీద ఒక స్మైల్ ఉంటుంది. సినిమా నుంచి బయటకు వచ్చేప్పుడు మంచి ఎమోషనల్ ఫీల్ తో వస్తారు. ఒక మంచి సినిమా మీకు ఇవ్వాలనే మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మా సినిమాకు మీడియా మిత్రులు పూర్తి సహకారం అందించారు. నేను మరో పది సినిమాలు చేసే ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు. మా టీమ్ లో జయసుధ గారి దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్ట్ ఎంతో సపోర్ట్ అందించారు. ప్రతి టెక్నీషియన్ ప్యాషన్ తో వర్క్ చేశారు. 90’s సినిమా ఓటీటీలోకి వచ్చాక చాలా మంది ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయ్యామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మా లాంటి చిన్న సినిమాకు ప్రైమ్ ఏరియాల్లో థియేటర్స్ దొరకడం కష్టం. కానీ నా మీద నమ్మకంతో మంచి సెంటర్స్ పడ్డాయి. కానీ ప్రేక్షకులే థియేటర్స్ కు రావాలంటే ఆలోచిస్తున్నారు. వారం తర్వాత చూద్దాం, పది రోజుల తర్వాత చూద్దామని అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటే మంచి సినిమాను థియేటర్ లో మిస్ అవుతూనే ఉంటారు. మీరు “సమ్మర్ హాలిడేస్” వంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఎంతోమంది శ్రీకర్ లాంటి దర్శకులు ఇలాంటి మంచి కథలు తెరకెక్కించగలుగుతారు. ఇది నిజం కాదని చెబితే నేను సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తా. ఓటీటీలో సినిమా చూసి అభినందిస్తే ఎవరికీ ఉపయోగం లేదు. థియేటర్స్ లో చూస్తేనే మా పర్పస్ నెరవేరుతుంది. పిల్లలతో మా సినిమాకు వస్తే మంచి విషయాలు నేర్చుకుంటారు. పిల్లలకు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. పెద్దల నుంచి పిల్లల దాకా మేము ఎవరినీ డిజప్పాయింట్ చేయం. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించే ప్రయత్నమే మా “సమ్మర్ హాలిడేస్”. అన్నారు.

నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్

Related Articles

Latest Articles