
ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం G.O.A.T (గోట్) Greatest Of AllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకత్వం వహించారు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. నితిన్ ప్రసన్న, సర్వదమన్ బెనర్జీ, బ్రహ్మాజీ, పృథ్వి రాజ్, మొత్తై రాజేంద్రన్, ఆనంద రామరాజు, చమ్మక్ చంద్ర, ఆదుకాలం నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక ఊరిలో ఒక వ్యక్తి ఆ ఊరిలోని వారందరికీ జూదానికి బానిసనం చేసి వారిని దోచుకుంటూ ఉంటాడు. అదే ఊరిలోని ఒక పెద్ద మనిషి ఐదు సంవత్సరాలకు ఒకసారి క్రికెట్ టోర్నమెంట్ ద్వారా అతడిని ఎదుర్కొంటుంటారు. తరతరాలుగా వారి కుటుంబం అతడని అలాగే ఎదుర్కొంటుండగా కొన్ని పరిస్థితుల వల్ల ఆట ఆడవలసిన యువకుడు తమను విడిచి వెళ్లిపోతాడు. ఇదిలా ఉండగా మరొక ఊరిలో ఒక యువకుడు కాలిగా ఉంటూ డబ్బు కోసం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. అలా ఉండగా అతను డబ్బు కోసం ఒక అమ్మాయిని పెళ్లి పీటల నుండి తీసుకుని వచ్చేస్తారు. అయితే ఆ అమ్మాయికి ఉన్న సమస్య ఏంటి? ఆ అమ్మాయికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? జూదానికి బానిసైన ఊరికి, ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? ఆ అమ్మాయికి జూదానికి బానిసైన ఊరికి ఉన్న సంబంధమేంటి? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా సుదీర్ ఈ చిత్రంలో హీరోగా బాగా నటించారు. ఎమోషన్స్ ఇంకా యాక్షన్ సీన్స్ లో తన నటన చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో మెచ్చుకుని తీయాల్సిందే. నటన విషయంలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను పూర్తిగా అలరించారు. దివ్య భారతి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ఒక పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూనే పట్టణ లుక్ తో మరింత ఆకర్షించారు. సినిమాలో ఆమె పాత్ర కాస్త బిన్నంగా ప్రేక్షకులను ఒక పక్క నవ్విస్తూనే మరో పక్క తన నటనతో ఎంటర్టైన్ చేశారు. నితిన్ ప్రసన్న సినిమాలో విలన్ పాత్రలో అత్యద్భుతంగా నటించారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకులు ఉద్రేకానికి గురయ్యేలా చేశారు. మొత్తై రాజేంద్రన్ హాస్యంతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
సాంకేతిక విశ్లేషణ :
ఈ చిత్రాన్ని వెండి తెరపై చూపించడంలో దర్శకుడు బాగా పని చేశారు. కథ కాస్త పాత సాధారణ కథ అయినప్పటికీ ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా చేశారు. సినిమాలోని పాటలు చాలా బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. తర్వాత సన్నివేశాలు అర్థమయిపోతున్నప్పటికీ మంచి హాస్యంతో బాగానే ముందుకు తీసుకుని వెళ్లారు. సినిమా క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, కలరింగ్, లొకేషన్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన, కామెడీ, పాటలు, దర్శకత్వం, క్వాలిటీ
మైనస్ పాయింట్స్ :
పాత కథ, అర్థమవుతున్న సన్నివేశాలు
సారాంశం :
ప్రేక్షకులను నవ్వులతో ముంచుతూ ఒక చక్కటి కథను కుటుంబ సమేతంగా ప్రేక్షకులు చూడదగిన చిత్రం GOAT.


