
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం “భగవంతుడు”. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. త్వరలో మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.
“భగవంతుడు” సినిమా షూటింగ్, ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి . ఈ చిత్రాన్ని ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ రవి పనస హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. డైరెక్టర్ జి జి విహారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా తెరకెక్కిస్తున్నారు. హీరో తిరువీర్ కెరీర్ లో “భగవంతుడు” సినిమా ప్రెస్టీజియస్ గా ఉండబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. “భగవంతుడు” సినిమాపై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
నటీనటులు: తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు, తదితరులు.
సాంకేతిక బృందం
- ఆడియో : మధుర
- కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం
- యాక్షన్: రామ్ కిషన్, రాబిన్ సుబ్బు
- పాటల రచయితలు: చంద్రబోస్, డా. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్,జి.జి. విహారి
- కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
- సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
- సంగీతం: కె.పి.
- ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
- లైన్ ప్రొడ్యూసర్: గౌతమ్ ఊడుగుల
- పీఆర్ఓ: సురేష్ (ఎస్కే మీడియా)
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – జి. జి. విహారి
- బ్యానర్: రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)
- నిర్మాత: రవి కుమార్ పనస
- సహ నిర్మాత: విద్య శ్రీ పనస


