డిసెంబర్ 4న విడుదల కానున్న ‘సీతన్నపేట గేట్’ – ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

వైఎంఆర్ క్రియేషన్స్ బ్యానర్ మీద వైఎంఆర్ నిర్మాణంలో దర్శకుడు వై. రాజ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సీతన్నపేట గేట్’. వేణు గోపాల్ హీరోగా.. నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాం రెడ్డి, పార్థు, 8 పీఎం సాయి కుమార్, సుధీక్షజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, హీరో విజయ రామరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ చిత్రాన్ని వైఎంఆర్ సార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ మూవీని రిలీజ్ చేస్తున్న నారాయణ సార్‌కి, బుజ్జి గారికి కంగ్రాట్స్. ఈ మూవీలోని ప్రతీ పాత్ర వైల్డ్‌గా ఉంటుంది. రాం గోపాల్ వర్మ దగ్గర పని చేసిన రాజ్ కుమార్ గారు కూడా అంతే వైల్డ్‌గా ఉంటారు. మ్యూజిక్ చాలా ట్రెండీగా ఉంది. యోగి ఫోటోగ్రఫీ కూడా బాగుంది. హీరో వేణు ఎంతో నేచురల్‌గా కనిపిస్తున్నాడు. మంచి సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారు. డిసెంబర్ 4న ‘సీతన్నపేట గేట్’ మూవీని చూడండి. అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ చిత్రంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రవి గారు, అంజి గారు నాతో ముందు నుంచీ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మా మూవీని ఒక్కసారి చూసి, నచ్చితే మాట్లాడండి అని మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐదు సాంగ్స్, ఎలివేషన్స్ అంటూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మాత్రం ఉండదు. ఇందులోని ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. నేను విన్న యదార్థ సంఘటనలకు నా కల్పనను జోడించి తీశాను. మేకింగ్, లైటింగ్ కొత్తగా ఉంటుంది. కథ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అందరూ చర్చించుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నిర్మాత వైఎంఆర్ మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ అనేది మాకు మొదటి ప్రాజెక్ట్. భాషా హద్దులు, సరిహద్దులు లేనిదే సినిమా మాధ్యమం. నాకు తెలుగు అంతంత మాత్రంగానే వచ్చు. ఇక్కడి ప్రేక్షకులు అంతులేని ప్రేమను కురిపిస్తుంటారు. హీరో, దర్శకుడు ఇలా అందరూ ప్రాణం పెట్టి నటించారు. మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. తెలుగులో మా సినిమాని రిలీజ్ చేస్తున్న బుజ్జి గారికి థాంక్స్. జెమినీ ల్యాబ్స్ అధినేత మనోహర్ గారి ప్రోత్సాహం వల్లే ఈ మూవీని తెలుగులోకి తీసుకు వచ్చాను. అందరూ మా చిత్రాన్ని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

హీరో వేణు గోపాల్ మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతోన్నాను. ఈ జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఎంతో మంది నిర్మాతలు మారారు. చివరకు ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. కొత్త వాళ్లందరం కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మాస్ సినిమాల్ని ఇష్టపడే వారందరికీ మా ‘సీతన్నపేట గేట్’ కచ్చితంగా నచ్చుతుంది. రాజ్ కుమార్ గారు ఈ మూవీ కోసం ప్రాణం పెట్టారు. ‘సీతన్నపేట గేట్’ చిత్రంతో అద్భుతం జరుగుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

విజయ రామరాజు మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలి. వేణు నాకు మంచి స్నేహితుడు. వేణుకి ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి. డైరెక్టర్ రాజ్ కుమార్ తొలినాళ్లలో నాకెంతో సపోర్ట్ చేశారు. వైఎంఆర్ గారికి లాబాలు రావాలని కోరుకుంటున్నాను. ‘సీతన్నపేట గేట్’ సినిమాని ప్రేక్షకులు చూసి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు, దర్శకుడు బాబు మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ ఏడు భాషల్లో రిలీజ్ కాబోతోంది. రాజ్ కుమార్ గారి మేకింగ్ స్టైల్ బాగుంది. హీరో వేణు గారికి మంచి విజయం దక్కాలి. వేణు ఎంతో నేచురల్‌గా కనిపిస్తున్నాడు. నిర్మాత వైఎంఆర్‌కి మంచి లాభాలు రావాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు, నిర్మాత రవి మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ చిత్రంతో వైఎంఆర్ గారికి మంచి విజయం దక్కాలి. హీరో వేణుకి మొదటి చిత్రంతోనే ఏడు భాషలతో ఏడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే అవకాశం దక్కింది. ఈ చిత్రం చాలా ప్రామిసింగ్‌గా ఉంటుంది’ అని అన్నారు.

కెమెరామెన్ యోగి రెడ్డి మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ చిత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన రాజ్ కుమార్ గారికి థాంక్స్. మా సినిమా డిసెంబర్ 4న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

డైలాగ్ రైటర్ రవి మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రాజ్ కుమార్ చెప్పిన కథకు మంచి మాటల్ని రాశానని అనుకుంటున్నాను. డిసెంబర్ 4న మా సినిమా రాబోతోంది’ అని అన్నారు.

లిరిసిస్ట్ మణికంఠ మాట్లాడుతూ .. ‘‘సీతన్నపేట గేట్’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రాజ్ కుమార్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మా చిత్రం డిసెంబర్ 4న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Seethannapeta Gate Will Definitely Appeal To Mass Movie Lovers: Hero Venu Gopal

Every Character In Seethannapeta Gate Is Wild; Everyone Will Enjoy It: Director V Samudra

Related Articles

Latest Articles