
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ రిలేషన్లో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆయన చేసిన పోస్టు వైరలవుతోంది. నిన్న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వారిద్దరూ బైక్ డ్రైవింగులో ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీనికి ‘థాంక్యూ స్వీటెస్ట్’ అంటూ లవ్ సింబల్‌తో ఆమె రిప్లై ఇచ్చారు. తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఈ ఫొటోను పంచుకున్నారు. కాగా వీరిద్దరూ కలిసి ఓ బాలీవుడ్ చిత్రంలో నటించారు.


