
మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గాసిప్”. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ చేయగా జై కుమార్ ఎడిటింగ్ చేశారు. రవివర్మ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు నటించగా రేపు అనగా ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా ప్రస్తుత సమాజంలో కొన్ని పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు ఈ చిత్ర ట్రైలర్ అనిపిస్తుందని అంటున్నారు. రేపు విడుదల కానున్న ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులు వరుస బుకింగ్స్ తో సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు.
నిర్మాత యతి మాట్లాడుతూ చిత్ర విడుదలకు సహకరిస్తున్న పివిఆర్ సినిమాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమాపై ఆసక్తి చూపుతున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని, చిన్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ చిత్రంలోని నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిర్మాతకు, విడుదలకు సపోర్ట్ చేస్తున్న పివిఆర్ సినిమాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి చిన్న సినిమాలను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు.
నటీనటులు : రాశి సింగ్, రవివర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు
సాంకేతిక సిబ్బంది :
రచయిత – వైభవ్ కౌండిన్య
నిర్మాత – ఏతి రేమెళ్ల
బ్యానర్ – వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్
సంగీత దర్శకుడు – శక్తికాంత్ కార్తీక్
డిఓపి- సతీష్
ఎడిటర్ – జై కుమార్
సహ నిర్మాత – నరసింహం తెలనాకుల
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
పిఆర్ఓ: మధు వి ఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం


