శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

దివంగత నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శాంతకుమారి అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. 1958 మే 15న శోభన్ బాబు, శాంతకుమారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన శోభన్ బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన సతీమణి శాంతకుమారి కూడా మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు, అభిమానుల్లో విషాదం నెలకొంది.

Related Articles

Latest Articles