
AP: Dy.CM పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతోనే భుజానికి సర్జరీ చేయించుకున్నట్లు జనసేన వెల్లడించింది. మంత్రిగా చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను ఆయన పాటిస్తున్నారని తెలిపింది. కాగా గతంలో జరిగిన ముక్కు సర్జరీకి కూడా ఆయన సొంతంగా ఖర్చులను భరించినట్లు వెల్లడించింది.


