షారుఖ్ ఖాన్ షూటింగ్‌లో గాయం: ‘కింగ్’ చిత్రీకరణకు బ్రేక్

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తన తాజా చిత్రం ‘కింగ్’ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. స్టంట్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదానికి గురైనట్లు జాతీయ మీడియా వెల్లడించింది. గాయాల కారణంగా షారుఖ్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు మల్టిపుల్ మజిల్ ఇంజురీ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే గాయాల తీవ్రత తక్కువగానే ఉన్నట్లు సమాచారం.

డాక్టర్ల సూచన మేరకు షారుఖ్ ఖాన్ నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో ‘కింగ్’ చిత్ర షూటింగ్‌కు తాత్కాలిక విరామం పడింది. ఈ చిత్రీకరణ అక్టోబర్ లేదా నవంబర్‌లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షారుఖ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

Latest Articles