మురళీ నాయక్ త్యాగానికి నివాళిగా “దేశం కోసం మనలో ఒక్కడు”

“ఆపరేషన్ సిందూర్”లో మన దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలొడ్డిన మురళీ నాయక్ సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం “దేశం కోసం మనలో ఒక్కడు”. యువ సంచలనం గోపివర్మ తెరకెక్కించిన ఈ ఇండిపెండెంట్ చిత్రాన్ని ప్రసాద్ (బాబి) నిర్మించారు. కోటేశ్వరరావు, రాజశేఖర్, కృష్ణవేణి, నాగరాజు, శ్వేత, సింధు, నాగబాబు, జ్యోతి, రాజు తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని హైద్రాబాద్ ప్రసాద్ లాబ్ లో జులై 19న లాంఛనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విడుదల వేడుకలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ, ప్రముఖ రాజకీయ నాయకులు గట్టు రామచంద్రరావు, సీనియర్ పాత్రికేయులు అక్కినేని శ్రీధర్, ధీరజ అప్పాజీ, జూనియర్ రాజశేఖర్ పాల్గొని, గోపివర్మ ను అభినందించారు. దర్శకుడిగా అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.

పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా, దేశం కోసం త్యాగం చేసిన మురళీ నాయక్ పై అమితమైన ఆరాధనతో ఈ చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చిన నిర్మాత ప్రసాద్ కి దర్శకుడు గోపివర్మ కృతజ్ఞతలు తెలిపాడు. “దేశం కోసం మనలో ఒక్కడు” సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నామని, తన దర్శకత్వంలో మొదలైన “రాయలసీమ ప్రేమకథ” ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందని వివరించాడు. ఇంత గొప్ప చిత్రం నిర్మించే అవకాశం రావడం పట్ల నిర్మాత ప్రసాద్ (బాబి) గర్వం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పని చేయడం, ఇందులో భాగం కావడం తమకు చాలా సంతోషంగా ఉందని నటీనటులు – సాంకేతిక నిపుణులు అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్: ఎమ్.ఎన్. ఆర్., సినిమాటోగ్రఫీ: వెంకీ కనకాల, సంగీతం: హర్ష ప్రవీణ్, నిర్మాత: ప్రసాద్ (బాబి) కథ – స్క్రీన్ ప్లే – సంభాషణలు – దర్శకత్వం: గోపివర్మ.

Related Articles

Latest Articles