
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ రాశీ ఖన్నా జోడీ కట్టారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆమె నటిస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమా చిత్రీకరణ చకచకా సాగుతోంది. ఈ మూవీలో శ్రీలీల కూడా హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అయితే గతంలో గబ్బర్ సింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ కు హరీష్ శంకర్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో పవన్ కళ్యాణ్ కు మార్క్ ఇండస్ట్రీ హిట్ పడుతుంది అని అభిమానులు నమ్ముతున్నారు.
ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న హరి హర వీరమల్లు సినిమా పై పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ ఢిల్లీ భామతో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో జోడీ కట్టడంతో ఈ సినిమా పై కూడా ప్రేక్షకుల అంచనాలు పెరుగుతున్నాయి. ఊహలు గుసగుసలాడే, జై లవ కుశ, తొలిప్రేమ, సుప్రీమ్ తదితర సినిమాల ద్వారా ఈ హీరోయిన్ ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ గా దగ్గరైంది.