కొచ్చిలో భారతదేశపు తొలి 14 మీటర్ల అకౌస్టిక్-ట్రాన్స్‌పరెంట్ 4K LED సినిమా స్క్రీన్ (UFO Moviez)

కొచ్చి, కేరళ | 17 ఆగస్టు 2026: భారతీయ సినిమా ప్రదర్శన రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. UFO Cinema Solutionsకు చెందిన ప్రీమియం లార్జ్-ఫార్మాట్ సొల్యూషన్ MAGNOVA, భారతదేశంలోనే తొలి 14 మీటర్ల Acoustic-Transparent Direct View 4K HDR LED Cinema Screenగా కొచ్చిలోని మ్యాజిక్ ఫ్రేమ్స్, కాక్కనాడ్‌లో ఆవిష్కరించబడింది.

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కేరళ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ ప్రారంభించారు. మంత్రులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలతో పాటు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన దిలీప్, పృథ్వీరాజ్ సుకుమారన్, కుంచాకో బోబన్, టొవినో థామస్, షేన్ నిగమ్, బాసిల్ జోసెఫ్, జయసూర్య, మంజు వారియర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

14 మీటర్ల తెరపై 4K HDR విజువల్ అనుభూతి
కొచ్చిలో ఏర్పాటు చేసిన MAGNOVA స్క్రీన్ 14 మీటర్లు x 6 మీటర్ల పరిమాణంలో ఉంటుంది. DCI ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ Direct View 4K HDR LED డిస్‌ప్లే 3.91mm Pixel Pitchతో, HEYLED టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. థియేటర్ ప్రదర్శనకు అనుగుణంగా ప్రత్యేకంగా క్యాలిబ్రేట్ చేయబడింది.

MAGNOVA లోని Acoustic-Transparent Technology ఈ స్క్రీన్‌కు ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తోంది. స్క్రీన్ వెనుకే స్పీకర్లను ఏర్పాటు చేయడం ద్వారా శబ్దం స్క్రీన్‌పై కనిపించే దృశ్యాల నుంచే వస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. దీంతో విజువల్స్, ఆడియో మధ్య మరింత సహజమైన అనుసంధానం ఏర్పడి, థియేటర్ అనుభవం మరింత ఇమ్మర్సివ్గా మారుతుంది.

దీనికి Dolby Atmos®️ Immersive Audio మరియు Pulz Cinema Speakers జత కావడంతో ప్రేక్షకులకు ప్రీమియం సౌండ్ అనుభవం లభిస్తుంది.
ప్రేక్షకులకు కొత్త అనుభూతి, ఎగ్జిబిటర్లకు కొత్త అవకాశం MAGNOVA ద్వారా ప్రేక్షకులు 4K HDR విజువల్స్, అద్భుతమైన కాంట్రాస్ట్, జీరో లైట్ స్పిల్, భారీ 14 మీటర్ల స్క్రీన్తో కూడిన ప్రీమియం థియేట్రికల్ అనుభవాన్ని ఆస్వాదించనున్నారు. స్క్రీన్ వెనుక నుంచి వచ్చే ఆడియో కారణంగా సినిమా అనుభూతి మరింత సహజంగా, లీనమయ్యేలా ఉంటుంది.

ఎగ్జిబిటర్లకు MAGNOVA ఒక ప్రత్యేకమైన Premium Large Format (PLF) ఆడిటోరియంను అందిస్తుంది. ప్రీమియం ధరల టికెట్లకు అనువైన ప్రత్యేక అనుభవంతో పాటు, భవిష్యత్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా థియేటర్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది.
దేశవ్యాప్తంగా విస్తరించనున్న MAGNOVA
కొచ్చిలో జరిగిన ఈ ఆవిష్కరణతో MAGNOVA దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. మెట్రో నగరాలతో పాటు అభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాల్లోనూ ఈ టెక్నాలజీని అందించేందుకు UFO Cinema Solutions ఇప్పటికే పలు ఎగ్జిబిటర్లతో చర్చలు జరుపుతోంది.

UFO Cine Media Network లో Cinema Solutions బిజినెస్ హెడ్ ప్రదీప్ శెట్టి మాట్లాడుతూ:
సినిమా ఫిల్మ్ నుంచి డిజిటల్‌కు, ఇప్పుడు Direct-View LEDకి పరిణామం చెందింది. MAGNOVA ఈ ప్రయాణంలో తదుపరి అధ్యాయం. మేము కేవలం స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం కాదు.. పూర్తి స్థాయి ప్రీమియం సినిమా అనుభవాన్ని నిర్మిస్తున్నాం. ఎగ్జిబిటర్లకు ఫ్యూచర్-రెడీ ఆస్తిని, ప్రేక్షకులకు థియేటర్లకు తిరిగి రావడానికి బలమైన కారణాన్ని అందించడమే మా లక్ష్యం. HEYLED ఆధారిత MAGNOVAతో పాటు CINITY ఆధారిత MAGNOVAను కూడా అభివృద్ధి చేస్తున్నాo.

UFO 2026 ఆగస్టు 18 మరియు 19 తేదీల్లో చెన్నైలో జరిగిన Big Cine Expo 2026లో తొలిసారిగా పరిశ్రమకు పరిచయమైంది. UFO బూత్‌లో ప్రదర్శించిన MAGNOVA ఉత్పత్తులు — HEYLED డిస్ప్లేలు, CINITY ప్రొజెక్టర్లు మరియు MAGNOVA కాన్సెప్ట్‌కు సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

UFO Cinema Solutions అనేది UFO Cine Media Networkకు చెందిన సినిమా టెక్నాలజీ మరియు సొల్యూషన్స్ విభాగం. ప్రీమియం లార్జ్ ఫార్మాట్లు, నెక్స్ట్ జనరేషన్ డిస్‌ప్లే టెక్నాలజీలు, ఇమర్సివ్ ఆడియో, సమగ్ర సినిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన థియేటర్లను నిర్మించేందుకు, అప్‌గ్రేడ్ చేసేందుకు ఎగ్జిబిటర్లతో కలిసి సంస్థ పనిచేస్తోంది.

ఈ సందర్భంగా, UFO Moviez CEO శ్రీ ప్రదీప్ శెట్టి MAGNOVA ఉత్పత్తులు (HEYLED & CINITY) కు లభించిన భారీ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమా అనుభవాన్ని అందించే లక్ష్యంతో MAGNOVA అనుభవాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా, తెలుగు రాష్ట్రాల Zonal Head శ్రీ G. లక్ష్మణ్ మాట్లాడుతూ, MAGNOVA ఉత్పత్తులైన HEYLED & CINITY అనుభవాన్ని త్వరలోనే Andhra/Telangana లో అందించేందుకు సన్నాహాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయని తెలిపారు.

Related Articles

Latest Articles