
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం హరిహర వీరమల్లు. జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మీడియా కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఖుషి సినిమా ద్వారా తొలిగా ఏ.ఏం రత్నం గారితో సినిమా తీశానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఏ.ఎం రత్నం గారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండే మనిషి అని, తన పని తాను చేసుకుంటూ చాలా పద్ధతిగా ఉంటారని తెలిపారు. మేకప్ ఆర్టిస్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా తదితర చిత్ర సాంకేతిక డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తూ నేడు రత్నం గారు ఈ స్థాయిలో ఉన్నారని తెలిపారు. దేశమంతా తలెత్తి చూసేంత గొప్ప సినిమాలో తీసినప్పటికీ ఆయన నేటికీ కూడా ఒదిగి ఉంటారని, అటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ తరఫున అండగా ఉండేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం గారి పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తానే ప్రతిపాదించినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే కందుల దుర్గేష్ గారు ఈ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే దిశగా రత్నం గారు ఈ పదవిలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో చిత్రపరిశ్రమ డెవలప్ అయ్యేందుకు అలాగే ఇతర విషయాల్లో కూడా పరిశ్రమకు, ప్రజలకు మేలు కలుగుతుందని తన ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆ పోసిషన్ లో ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం గారు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అఫీషియల్ వార్త కోసం వేచి చూడాల్సిందే.