“చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి” – డెలులు చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ రాజ్ కుమార్

క్రియేటివ్ లాంచ్ పాడ్ బ్యానర్ పై ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డెలులు. విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు పోషించారు. రేష్మిత్ ఎస్ కౌశిక రచించిన ఈ కథకు విజయ రాజ్ కుమార్ డైలాగులు అందించగా జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ చేశారు. ఆది చేబ్రోలు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి హరికృష్ణ కూరపాటి ఎడిటర్ గా పనిచేశారు. నేటి జెన్ జి యువతకు దగ్గరగా ఉండే ఈ సినిమా జెన్ జి భాషలోనే డెలులు అని ఉపయోగించే ఒక పదంతో జెన్ జి ప్రేక్షకులను టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది.

ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ జై రాజ్ నాయుడు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకు అవకాశం ఇచ్చి సపోర్ట్ గా నిలిచిన మా డైరెక్టర్ గారికి థాంక్స్. ఈ సినిమా మొదలై రెండు సంవత్సరాలు అయింది కాని నేను మా నిర్మాతను ఇప్పటి వరకు కలవలేదు. నన్ను కలవకుండానే నా ప్రతిభను నమ్మి, నాకు ఈ చిత్రానికి పని చేసేందుకు అవకాశం ఇచ్చారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది” అన్నారు.

ఎడిటర్ హరికృష్ణ మాట్లాడుతూ… “కొత్తవారు అందరూ కలిసి ఈ సినిమా చేశాం. సినిమాలో చాలా ఫన్ ఉంటుంది. సినిమాను అందరూ ఆశిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు ఆది చేబ్రోలు మాట్లాడుతూ… “డెలులు అనే పదం జెన్ జి నుండి వచ్చింది. తొలి చిత్రంతో చాలా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించాము. నిర్మాత సంకీర్త్ గారు మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక అన్నలా చూసుకున్నారు. ఇలా ఒక స్టేజ్ పై మాట్లాడటం కొన్ని సంవత్సరాల కల. నేను ఈ సినిమా కోసం పని చేయడానికి ముఖ్య కారణం డిఓపి జై రాజ్ నాయుడు గారు. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్” అన్నారు.

నటుడు అఖిల్ జాక్సన్ మాట్లాడుతూ… “మొదటిసారి ఇలా స్టేజ్ పై మాట్లాడుతున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ. నాకు అవకాశం ఇచ్చిన సినీ బృందానికి థాంక్స్. సినిమా చాలా బావుండబోతుంది. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ థాంక్స్” అన్నారు.

హీరోయిన్స్ వేణి రావు, సాయి ప్రసన్న మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మాకు అవకాశం అందించిన దర్శకనిర్మాతలకు థాంక్స్. సినిమా చాలా బావుంటుంది. అందరూ మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాము” అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రీతం మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులకు, ముఖ్య అతిథులకు ధన్యవాదాలు. సినిమా అనేది ఒక్కరి కృషితో సాధ్యం కాదు, మొత్తం టీమ్‌ సమష్టి కృషి వల్లే సినిమా పూర్తవుతుంది. ప్రొడక్షన్ కంట్రోలర్ చందు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రిత్విక్, డైరెక్షన్ టీమ్ క్రాంతి, నారాయణ, డీవోపీ జయరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆది చేబ్రోలు, ఎడిటర్ హరికృష్ణలకు ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమాలో సంగీతం, డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి, టీజర్‌లో విన్న మ్యూజిక్ కంటే సినిమాలో మరింత అద్భుతమైన సంగీతం ఉంటుంది. విజయ్ రాజ్‌కుమార్ రాసిన కథ ఆధారంగా విజన్‌తో డైలాగ్స్‌ను రూపొందించడం జరిగింది. హీరోయిన్లు ప్రసన్న, వేణి, మదర్ రోల్ చేసిన రమ, బాలనటిగా నటించిన అనికకు కూడా ధన్యవాదాలు. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాను, నా పై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సంకీర్తి గారికి, హీరో విజయ్ రాజ్‌కుమార్ గారికి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను” అన్నారు.

జిగిరీస్ చిత్ర నటుడు కృష్ణ మాట్లాడుతూ… “ఈ సినిమాను సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్. ఈ సినిమా టీజర్ చూసిన చాలా మజా అనిపించింది. ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

సీక్రెట్ సోలిజర్ చిత్ర దర్శకుడు అక్కి విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ… “నన్ను ఆహ్వానించిన చిత్ర బృందంకి థాంక్స్. ఈ సినిమా టీజర్ చూస్తే మంచి విజయం సాధిస్తుంది అనిపిస్తుంది. సినిమా బృందం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

నటుడు విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. డెలులు సినిమా వెనుక సంకీర్త్ కొండ కీలక పాత్ర పోషించారు. నేను కేవలం 10 నిమిషాల ఫోన్ కాల్‌లో కథ చెప్పగానే సంకీర్త్ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. టీజర్‌లో కూడా ‘బిలీవ్డ్ బై సంకీర్త్ కొండ’ అని ప్రత్యేకంగా పేర్కొన్నాము. ఇప్పటివరకు ఎవరూ సాహసించని కథను ‘డెలులు’ ద్వారా చెప్పబోతున్నాము, ప్రేక్షకులు సినిమాలో కొత్త అనుభూతిని పొందుతారు. సినిమాను భారీగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో టైటిల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుగానే నాలుగైదు కార్యక్రమాలు నిర్వహించాము. సినిమా డబ్ కట్ చూసిన తర్వాత నిర్మాత మార్కెటింగ్ బడ్జెట్‌ను పెంచి, సినిమాను మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. డీవోపీ జైరాజ్ నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఆది, ఎడిటర్ హరికృష్ణ, హీరోయిన్ శ్రీదేవి, హీరోయిన్లు, నటుడు అఖిల్ తదితరులు కృషి చేశారు. ముఖ్యంగా ఎడిటర్ హరికృష్ణ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ ప్రీతమ్ చాలా బాగా సినిమాను తెరకెక్కించారు, తన మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ చూపించారు. నటుడు అభినయ్‌కు సినిమాలో మంచి పాత్ర ఉంటుంది. సినిమాలో పనిచేసిన వారంతా కొత్తవాళ్లే. ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన పీఆర్‌ఓ మధు, అజయ్, స్టార్ సర్కిల్ టీమ్‌కు ధన్యవాదాలు. రైటర్ రేష్మిత్ కలిసి కథను వేగంగా పూర్తి చేయడంలో ఎంతో సహకరించారు. నా తొలి సినిమా సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనను అభినందిస్తూ మెసేజ్ పంపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒకసారి చిరంజీవి పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి, “చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి” అని భావించాను. ఆ ఆలోచనతోనే మళ్లీ కొత్తగా ప్రారంభించాను, ఇప్పుడు ‘డెలులు’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిరంజీవి గారి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది” అంటూ ముగించారు.

నటీనటులు :
విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ

సాంకేతిక బృందం :
బ్యానర్ – క్రియేటివ్ లాంచ్ పాడ్
దర్శకుడు – ప్రీతం కస్తూరి
నిర్మాత – సంకీర్త్ కొండ
రచయిత – రేష్మిత్ ఎస్ కౌశిక
డైలాగ్స్ – విజయ రాజ్ కుమార్
సినిమాటోగ్రాఫర్ – జై రాజ్ నాయుడు
ఎడిటర్ – హరికృష్ణ కూరపాటి
సంగీత దర్శకుడు – ఆది చేబ్రోలు
పిఆర్ఓ – మధు విఆర్

Related Articles

Latest Articles