
శ్రీ లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై తుమ్మ లక్ష్మారెడ్డి దర్శకత్వంలో ఎస్కేఎల్ఎం మోషన్ పిక్చర్స్ ద్వారా శ్రీనివాసరావు సవరం, సుబ్బారావు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం భళారే సిత్రం. శివ, కృష్ణ, దివ్య, మౌనిక, పాండు తదితరులు ఈ చిత్రంలో పాత్రలు పోషించగా సతీష్ ఈ చిత్రానికి డిఓపిగా పనిచేశారు. సమీ కట్టుపల్లి సంగీతం అందించగా శ్రీనివాసరావు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
కొత్తగా పెళ్లయిన రెండు గంటల మధ్య జరిగే కథ భళారే సిత్రం. శివ, సీత ఒక జంటగా పాండు, దివ్య మరో జంటగా ఈ చిత్రంలో కనిపిస్తారు. అయితే ఈ జంటల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం వల్ల వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? వారి మధ్య వచ్చిన సమస్యలకు ఎటువంటి అనుమానాలు, సంభాషణలు జరిగాయి? చివరికి వారి జీవితాలు ఏమవుతాయి అని ఆసక్తికర ప్రశ్నలతో సమాధానం తెలియాలంటే వెండి ధరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన:
శివ ఒక కూల్ లుక్ తో చాలా న్యాచురల్ గా తన పాత్రని పర్ఫార్మ్ చేశారు. భావోద్వేరాలతో కూడిన సన్నివేశాలలో మంచి పర్ఫామెన్స్ తో దివ్య ప్రేక్షకులను మెప్పించారు. పాండు మంచి కామెడీ టైమింగ్తో న్యాచురల్ గా డైలాగ్ డెలివరీ చేస్తూ ప్రేక్షకులను అల్లరించారు. కృష్ణ తన మౌన పాత్రలో అటు బాడీ లాంగ్వేజని బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను తన పర్ఫామెన్స్ తో కట్టి పడేశారు. మౌనిక మన పాత్రకు తగ్గట్లు తన పరిధిలో తాను నటించారు.
సాంకేతిక విశ్లేషణ :
చాలా సింపుల్ లైన్ తో తీసుకున్న కథను వెండితెరపై ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో దర్శకుడు లక్ష్మారెడ్డి విజయం సాధించాడు. పాటలు అంతకుమాత్రంగా ఉన్నప్పటికీ భావం పేదల సమయంలో బిజిఎం ప్రేక్షకులను మెప్పించడంలో సంగీత దర్శకుడు సక్సెస్ అయ్యారు. రెండు జంటలను బ్యాలెన్స్ గా చూపిస్తూ తన స్కిల్స్ చూపించారు డిఓపి. కలరింగ్, లొకేషన్స్ ఇంకా ఇతర సాంకేతిక విశేషాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చిత్ర విశ్లేషణ :
పల్లెటూరు నుండి పట్టణం వరకు పెళ్లయిన తర్వాత జీవితాలు ఒకేలా ఉంటాయని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అటు యువకులను, నవ జంటలనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే విధంగా తెరకెక్కింది. ఎన్నో మలుపులతో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది ఈ చిత్రం. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉండటంవల్ల సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ప్రేక్షకులు చూస్తారు.
ప్లస్ పాయింట్స్ :
కథ, డైలాగ్స్, బిజిఎం, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్ :
రెండవ భాగం స్లోగా ఉండటం, పాటలు.
సారాంశం :
ఈ తరం యువతను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం “భళారే సిత్రం”.


