
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రానికి విజయ్ బల్గనిన్ సంగీతాన్ని అందించిన శ్రీ సాయికుమార్ దార సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఎస్బి ఉద్ధవ్ ఎడిటింగ్ చేసిన ఈ చిత్రం నేడు విడుదల కావడం జరిగింది. ఇక చిత్ర రివ్యూ విషయానికి వస్తే….
కథ :
ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాలలో, తమ తల్లిదండ్రులు పిల్లలకు ఉండే ప్రేమానుబంధాలు ఆధారంగా ఈ చిత్రం తరగతిలో జరిగింది. మధ్యతరగతి కుటుంబంలోని ఒక అమ్మాయి తన తండ్రి తహతకు మించి తనకు ఎన్నో చేస్తున్నప్పటికీ అవి సరిగా అర్థం చేసుకోలేని చిన్న వయసులో ఉంటుంది. అదే సమయంలో ఆ వయసుకు తగ్గట్లు ప్రేమలో పడుతుంది. అయితే ఆ ప్రేమ ఎటువంటి ప్రయాణానికి దారితీస్తుంది? దానివల్ల వారి జీవితాల్లో వచ్చే మార్పులు ఏంటి? తన తండ్రి తనకోసం ఎంతగా తపన పడతారు అనే విషయం తనకు అర్థమయ్యే సమయానికి తన జీవితంలో ఇటువంటి మార్పులు వస్తాయి? చివరికి తన తల్లిదండ్రులను అర్థం చేసుకుంటుందా లేదా ప్రేమించిన వ్యక్తిని నమ్ముతుందా? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై బ్యూటీ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ చిత్రంలో ముందుగా మాట్లాడుకోవాల్సినది వికే నరేష్ గారి నటన గురించి. ఎన్నో చిత్రాలలో ఎన్నో పాత్రలు చేస్తూ తన నటనను ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్న వ్యక్తి నరేష్ గారు. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా ఒక మధ్యతరగతి తండ్రి వలె ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేయడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబంలోని తండ్రి తన పిల్లల కోసం ఎంత కష్టపడతారు అనే విషయం అలాగే తమ పిల్లలకు కోరిన ప్రతి కోరికను తీర్చేందుకు ఎంత కష్టపడతారో చూపిస్తూ ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తిరిగే విధంగా తన నటనను ప్రదర్శించారు.
తల్లి పాత్రలో వాసుకి గారి నటన అద్భుతంగా ఉంది. మధ్యతరగతి కుటుంబంలోని తల్లి తమ పిల్లలకు ఎటువంటి భయాలు బాధ్యతలు నడిపిస్తూ పెంచుతారో అందరికీ తెలిసిందే. అలాగే ఇంట్లో తన భర్త ఆదాయాన్ని ఒక పద్ధతిగా ఖర్చు పెడుతూ ఇంట్లో ఉండే ప్రతి ఖర్చును గుర్తు చేస్తూ తమ స్థాయి ఏంటో తమ పిల్లలకు అర్థమయ్యేటట్లు తెలపడంలో కుటుంబంలోని ఒక తల్లి ఎటువంటి పాత్ర పోషిస్తుందో అటువంటి పాత్రను ఈమె అద్భుతంగా పోషించారు.
సినిమాలో హీరో పాత్ర పోషించిన అంకిత కొయ్య ప్రస్తుతానికి పరిచయం అవసరం లేని పేరు. ఆయ్, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, తిమ్మరుసు, బచ్చలపల్లి వంటి చిత్రాలలో విభన్నమైన పాత్రలు పోషిస్తూ తన నటనను ప్రతిపాత్రలోనూ మరింత బాగా ప్రేక్షకులకు చూపిస్తూ ఇప్పటికే ఒక సక్సెస్ఫుల్ నటుడిగా ముందుకు వెళ్తున్నారు. అలాగే మీ చిత్రంలో కూడా తనదైన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ ఒక విభిన్నమైన పాత్రను మీ చిత్రంలో పోషించి ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా పర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా తన పాత్రలోని విభిన్న షేడ్స్ పండిస్తూ ప్రతి సీన్ లోను ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.
హీరోయిన్ పాత్ర పోషించిన నీలఖి తన పాత్ర పరిధిలో తాను నటిస్తూ తొలి తెలుగు చిత్రం అయినప్పటికీ పూర్తిగా ఒక తెలుగమ్మాయిలా కనిపించడం విశేషం. కొన్ని సీన్లలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలాగే ఆమె చిత్రం కోసం చూపించిన డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అటు తనతో పాత్రతో పాటు ఇటు ఎక్స్ప్రెషన్స్ ఇంకా సీన్ పండించే ఎమోషన్ కూడా ఎంతో బాగా ఎంతో బాగా క్యారీ చేశారు.
నాగేంద్ర కేవలం కంటి చూపులు ఇంకా కొన్ని ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. ప్రసాద్ బెహరా, నందగోపాల్, బలగం మురళీధర్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న వెండితెరపై కనిపించిన సమయం తక్కువైనప్పటికీ తమదైన పాత్రలకు న్యాయం చేస్తూ పూర్తి పెర్ఫార్మన్స్ తో సీన్లను మరింత బాగా పండేందుకు ఎంతో తోడ్పడ్డారు.

సాంకేతిక విశ్లేషణ :
కొన్ని యదార్థ సంఘటనల నుండి తీసుకున్న కథను సినిమాటిక్ లిబర్టీతో బయట ప్రస్తుతం ఉన్న సిచువేషన్ తో కనెక్ట్ చేస్తూ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా వెండితెరపై చూపించడంలో కథ రాసిన సుబ్రహ్మణ్యం అలాగే దర్శకత్వం చేసిన వర్ధన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అలాగే తాము అనుకున్న చిత్రాన్ని వెండితెరపై వచ్చేందుకు డిఓపి తన కెమెరా ద్వారా చూపించడంలో సక్సెస్ అయ్యారు. సినిమాలోని పాటలు ఎంత అద్భుతంగా సిచువేషన్ కి తగ్గట్లు ఉన్నాయి. అలాగే సినిమా అంతటా బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంతో ప్లేసేంట్ గా అలాగే కొన్ని సీన్స్ లో యాక్షన్స్ ఇంకా సిచువేషన్ కు తగ్గట్లు హై ఇచ్చే విధంగా ఉన్నాయి. మొదటి భాగం కొంచెం స్లోగా ఉన్నప్పటికీ రెండవ భాగం చిత్రానికి ఎంతో హైపిస్తూ చిత్రాన్ని మరొక లెవెల్ తీసుకువెళ్లింది. లొకేషన్స్ అటు వైజాగ్ లో అలాగే ఇటు హైదరాబాదులో రియల్ లొకేషన్స్ లో తీసినట్లు అర్థమవుతుంది. ఇతర సాంకేతిక విషయాలలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునట్లు అర్థమవుతుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, సాంగ్స్, నటీనటుల నటన చిత్రానికి బోనస్.
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ఫస్ట్ హాఫ్, సినిమా స్లోగా ఉండటం.
సారాంశం :
ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూసేలా ఒక చక్కటి సందేశంతో అలాగే ప్రస్తుత సమాజం పట్ల ఒక అవగాహన కలిగించే విధంగా ఈ చిత్రం అన్ని వయసుల వారు చూసే విధంగా ఉంది.