‘అఖండ 2: తాండవం’ నుండి దసరా శుభాకాంక్షలు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాలుగో చిత్రం, హై-ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. రామ్ అచంత మరియు గోపిచంద్ అచంత ఆధ్వర్యంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. టీజర్‌తో భారీ బజ్ సృష్టించిన ఈ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

బోయపాటి శ్రీను భారీ కాన్వాస్‌పై రూపొందిస్తున్న ఈ సీక్వెల్ గ్రాండ్ సినిమాటిక్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలకృష్ణ లాంగ్ హెయిర్, రగ్డ్ బీర్డ్‌తో పవిత్రమైన మాలలు, ఆభరణాలతో అలరారుతున్నారు. భారీ త్రిశూలం పట్టుకుని, సాఫ్రాన్ మరియు బ్రౌన్ రోబ్స్‌లో మిథలాజికల్ లుక్‌లో కనిపిస్తున్నారు. స్నోయీ, వైబ్రంట్ బ్యాక్‌డ్రాప్‌తో డైనమిక్ పోజ్ ఇంటెన్సిటీని పెంచుతోంది.

ఎస్ ఎస్ తమన్ రౌసింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హై-వోల్టేజ్ సీన్లను మరింత ఎలివేట్ చేస్తుంది. బాలకృష్ణ ఫీర్స్ మరియు స్పిరిచ్యువల్ అవతార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. రిలీజ్ డేట్‌తో ప్రమోషనల్ క్యాంపెయిన్ బలంగా సాగనుంది. శక్తివంతమైన టీమ్‌తో సోరింగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ‘అఖండ 2: తాండవం’ స్పిరిచ్యువల్ యాక్షన్ ఎక్స్‌ట్రావగంజాగా రానుంది.

కాస్ట్: నందమూరి బాలకృష్ణ, సంయుక్త , ఆది పినిశెట్టి, హర్షలి మల్హోత్రా

టెక్నికల్ క్రూ:

రచన, దర్శకత్వం – బోయపాటి శ్రీను

నిర్మాతలు – రామ్ అచంత, గోపి అచంత

బ్యానర్ – 14 రీల్స్ ప్లస్

సమర్పణ – ఎం. తేజస్విని నందమూరి

సంగీతం – తమన్ ఎస్

సినిమాటోగ్రఫీ – సి. రామ్‌ప్రసాద్, సంతోష్ డి డెటకే

ఎడిటర్ – తమ్మిరాజు

ఆర్ట్ – ఎఎస్ ప్రకాశ్; ఫైట్స్ – రామ్-లక్ష్మణ్

పిఆర్ఓ – వంశీ-శేఖర్

మార్కెటింగ్ – ఫస్ట్ షో

Related Articles

Latest Articles