‘కాంతారా చాప్టర్ 1’ రికార్డు స్థాయి వసూళ్లు

రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 89 కోట్లు+ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. బుక్‌మైషోలో మొదటి రోజు 1.28 మిలియన్ టికెట్లు అమ్ముడవడం ఈ ఏడాది ఏ భారతీయ చిత్రానికీ లభించని అత్యధిక రికార్డు.

దసరా సీజన్‌లో నిన్న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందన పొందింది. విమర్శకులు, ప్రేక్షకులు ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు. మిథాలజీ, ఫోక్‌లోర్‌లో మునిగిపోయిన కథ, అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్‌తో రిషబ్ శెట్టి డ్యూయల్ రోల్ బ్రిలియన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

రెండో రోజు కూడా హౌస్‌ఫుల్ షోలు నమోదవుతున్నాయి. బుక్‌మైషోలో గంటకు 60 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. మంచి వర్డ్ ఆఫ్ మౌత్‌తో ఈ చిత్రం అనేక బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.

Related Articles

Latest Articles