
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తె ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా జరిగిన ఒక భయానక ఘటనను ఆయన వెల్లడించారు. అపరిచితుడు ఆమెతో చాట్ చేస్తూ నగ్న ఫోటోలు అడిగినట్లు అక్షయ్ తెలిపారు. ఈ ఘటన తన కుటుంబంలోనే జరగడం వల్ల సైబర్ నేరాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
పిల్లలు మొబైల్ ఫోన్లు వాడేటప్పుడు సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఎంతో ఉంది. ఆన్‌లైన్ గేమ్‌లు, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లలో అపరిచితులు పిల్లలను టార్గెట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీలను నిశితంగా పర్యవేక్షించాలి” అని అక్షయ్ కుమార్ హెచ్చరించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ సైబర్ సేఫ్టీ పట్ల అవగాహన పెంచేందుకు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్షయ్ వంటి ప్రముఖులు ఇలాంటి ఘటనలను బహిర్గతం చేయడం ద్వారా సమాజంలో అవగాహనను పెంచుతున్నారు. పిల్లలు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.