#PuriSethupathi మూవీలోకి నేషనల్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతిల కలయికలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం #PuriSethupathi షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జెబి మోషన్ పిక్చర్స్ పతాకంపై జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన టాలీవుడ్ లక్కీ ఛార్మ్ సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ కలగలిపిన ఒక కొత్త తరహా సంగీత అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మాజీ, విటివి గణేష్ హాస్య పాత్రలలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Related Articles

Latest Articles