
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన ఇతర క్యాస్ట్ అండ్ క్రూ మీడియా వారితో సంభవించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం చెప్పారు.
మంచు విష్ణు :
- ఇప్పటికే 115000 టికెట్లు 24 గంటల్లో బుక్ అయినాయి. నాకు ఇది శివలీలలా ఉంది.
- సెన్సార్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఉత్తరాంధ్రలో కొన్ని విషయాలకు కొన్ని సంఘటనలు ఒప్పుకోలేదు. చాలా కష్టపడి జరిగినది అందరికీ తెలియాలి అని ఎంతో కష్టపడి వారిని ఒప్పించాను. చాలా తక్కువ కట్స్ చెప్పారు.
- తెలంగాణలో టికెట్ ప్రైజ్ హ్యూజ్ లేదు. మల్టీప్లెక్స్ లో పాప్కార్న్ రేట్ తగ్గినప్పుడు నేను ఆలోచిస్తా. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెంచాం.
- పిల్లలకి US లో 12$ మాత్రమే. చరిత్ర పిల్లలకి తెలియడం మా ముఖ్య ఉద్దేశం. చరిత్ర అందరికి తెలియడం కోసం ఈ సినిమా చేశాం.
- ప్రభాస్ కి మొహమాటం ఎక్కువ. సినిమాలో నటించినందుకు చాలా సంతోషం.
- వార్నింగ్ ఇచ్చే స్పేస్ లో నేను లేను. సినిమా అందరికీ నచ్చుతుంది. నోటీస్ ఇవ్వడానికి కారణం చిత్ర ఇంటెగ్రిటీ కాపాడేందుకే.
- సినిమా చూసిన ముగ్గురు ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఒకరు 3.5 & మరొకరు 4 ఇచ్చారు. మరొకరు విడుదల సమయంలో చెప్తాను అన్నారు.
- పైరసీ చేస్తే వారి అకౌంట్ లు బ్లాక్ చేయబడతాయి.
- సినిమా కోసం పనిచేసిన వారి వల్లనే నేను ఈ సినిమా ఎంతో ప్రశాంతంగా చేయగలిగాను. మేము అంత సినిమా విడుదల కోసం ఇన్నాళ్లు వేచి చూస్తున్నాము.
- ప్రేక్షకుల ఆశీర్వాదం పై సినిమా కలెక్షన్స్ ఉండబోతాయి.
- నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో ఉండబోతున్నారు. 2.5 సంవత్సరాల నా కూతురు సినిమాలో డైలాగ్ చెప్పింది.
- చిత్రం షూటింగ్ సమయం అంతటా మాంసాహారం తిన్నాను. ప్రభాస్ కి నేనే భోజనం పెట్టాను.
- కుబేర సినిమా వల్ల కన్నప్ప కు అంత ఇబ్బంది అవుతుంది అనుకోవడం లేదు. ఏ సినిమాకి ఉండే ఆడియెన్స్ దానికి ఉంటారు.
- సనాతన ధర్మం ఎప్పటి నుండో ఉంది. సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కరు, శివ భక్తులు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఈ చిత్రాన్ని ఇప్పటికే చూసిన వాళ్లు అన్నారు.
- దేశంలో తొలి షో కర్ణాటకలో రాత్రి 2 గంటలకు పడబోతోంది.
- నా సినిమా 10 వారాల లోపు ఓటిటిలో రాదు.
- ఈ సినిమా ఎవరిని అవుమానించడానికి కాదు. కొంతమంది పబ్లిసిటీ కోసం ఈ సినిమా పై బురద చల్లడానికి చూస్తున్నారు. అటువంటి వారిపై నాకు గౌరవం ఇవ్వడం ఇష్టం ఉండదు.
- సినిమాలో మా నాన్న గారికి ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు ముందుగా ఆయన అటువంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోలేదు.
- ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టడానికి నాన్న గారికి నమ్మకం కన్నప్ప కథ. అంత గొప్ప భక్తుని కథ కాబట్టే అంత బడ్జెట్ పెట్టారు.
- సినిమాలో ప్రభాస్ మొత్తం 40 నిమిషాలు ఉండబోతున్నారు.
- మోహన్ లాల్ గారు క్యారెక్టర్ సినిమాలో పెద్ద సర్ప్రైజ్ గా ఉంటుంది.
- సినిమాలో ఒక్క ఇండస్ట్రీ నుండి ఒకోకరు ఉన్నప్పటికీ ఇంత పెద్ద రిలీజ్ కావడానికి కారణం ప్రభాస్.
- ఈ శుక్రవారం నాది. శివ ఆశీస్సులతో నేను ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తున్నాను. అందరూ నన్ను ప్రశంసిస్తారు.
- ఈ సినిమా పురాణంలా కాదు, మన చరిత్రలా చూడండి. ఎందుకంటే ఈ కథ ఇక్కడే జరిగినది. ఇప్పటికీ ఆయనను పూజించేవారు ఉన్నారు. కన్నప్ప ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి.
- కన్నప్ప పురాణంలో మనిషి కాదు. ఆయన చరిత్రలో ఉన్న మనిషి.
- UKలో కన్నప్పను పురాణంలోని మనిషిలా చూస్తారు కానీ ఆయన మన దేశ చరిత్రలోని మనిషి.
- చివరిలో 40 నిమిషాలు ప్రేక్షకులకు ఎంతో అనుభవాన్ని ఇస్తాయి.
- సినిమా సెన్సార్ చేసినప్పుడు వేరు వేరు బ్యాక్గ్రౌండ్ తో ఉన్నవారు చూశారు. ఎవరికీ ఎటువంటి అభ్యంతరం రాలేదు.
- మార్చ్ లో సినిమా వాయిదా పడినప్పుడు నేను కొంత మందికి చూపిస్తే వారు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.
- నేను ప్రభాస్ కు తగ్గ స్టార్డంకు తగ్గట్లు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, నాన్న గారి స్టేచర్ కు తగ్గట్లు క్యారెక్టర్ రాసుకున్నాను కాబట్టి సరిపోయింది. కాని రజనికాంత్ గారికి కారెక్టర్ కు రాసే అంత గొప్పగా నేను రాయలేను.
- వెంకటేష్, అల్లు అరవింద్ ఇంకా ఎంతో మంది నుండి నాకు కాల్స్ వచ్చాయి.
- సినిమా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చూపించే ప్రయత్నం చేస్తాను.
- సినిమాలో శివ బాలాజీ క్యారెక్టర్ తక్కువ రోజులు అయినప్పటికీ అతను తానే చేస్తాను అని చెప్పారు. అతని క్యారెక్టర్ క్లైమాక్స్ లో హై ఉంటది.
- రఘు బాబు గారు కన్నప్ప విడుదల అయ్యే వరకు వేరే ఆలోచన పెట్టుకోకు అన్నారు.
- సినిమాకు యూ/ఏ వచ్చింది కారణం కాస్త యాక్షన్. సినిమా చివరిగా డబ్బు సంపాదించడం కోసం కూడా.
- తిన్నడు కన్నప్ప గా ఎలా మారాడో కన్నప్ప చూస్తే అర్థం అవుతుంది.
- కన్నప్ప నేను పుట్టి పెరిగిన ప్రాంతం వారు. కొన్ని సార్లు జీవితంలో దేవుడు లేదు అనుకుంటాం. నేను సినిమా చేసిన తర్వాత సినిమాను ఎడిట్ రూంలో చూసినప్పుడు శివుడు నాతో ఈ సినిమా చేయించారు అని నమ్ముతున్నాను. 12 జ్యోతిర్లింగాలు తిరగేసాను. నా మనసంతా పూర్తిగా భక్తి మాత్రమే ఉంది.
- భక్త కన్నప్ప చిత్రం చేసిన కృష్ణం రాజు గారి వారసుడు ప్రభాస్ ఈ సినిమాలో చేయడం ఒక అదృష్టం, యాదృచికం.
- కన్నప్ప నాస్తికుడిలా ఉండటానికి కారణం ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తారు.
- నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలేదు. రేపు చూడబోతున్నాను.
- సినిమా విడుదల తర్వాత నెగెటివ్ రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. వారి గురించి పబ్లిక్ కు తెలుసు, నేను బయపడక్కర్లేదు.
- నాన్న గారికి, ప్రభాస్ కు జరిగే క్యారెక్టర్ బయట ఎలా ఉంటదో అలాగే ఉంటుంది. నా ప్రశ్నలకు ప్రభాస్ చెప్పే సమాధానాలు చాలా బావుంటాయి.
- సినిమాలో అక్షయ్ కుమార్ గారినే మొదటి నుండి శివునిలా ఫిక్స్ అయ్యాము. ప్రభాస్ గారిని కాదు.
డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ :
- వాస్తవం ఏంటి అంటే దేశంలో ఏ మూల జరిగిన కథ అయిన కూడా దేశం అంతటి కథ.
- కన్నప్ప ప్రపంచం అంతటా తెలియాల్సిన సమయం ఇది. కన్నప్ప చదువుకోనప్పటికీ 10వ నయనార్ గా పరిగణింపబడినారు.
- ఉత్తర భారతదేశంలో కన్నప్ప ఎవరో తెలియని వారికి ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. దానికి కారణమైన విష్ణు & మోహన్ బాబు గారికి ధన్యవాదాలు.
- కాళహస్తి నుండి ఒక పంతులు గారు కన్నప్ప 2 గురించి అడిగితే అది కష్టం కాబట్టి ప్రీక్వెల్ తీసే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నాము.