కుటుంబంతో సహా వెళ్లేందుకు వీలుగా “సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని” ఆఫర్లు

క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని చిత్రం మార్చి 6, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన శివాజీ మరోసారి తన ప్రత్యేక శైలితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయనకు జోడిగా లయ నటిస్తున్నారు. దర్శకత్వం సుధీర్ శ్రీరామ్ వహించగా, ఈ ప్రాజెక్ట్‌ను ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌గా రూపొందించింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి పంపిణీ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను తెచ్చుకుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్రబృందం ప్రత్యేకమైన “ఫ్యామిలీ టికెట్” ఆఫర్‌ను ప్రకటించింది.

ఎంపిక చేసిన థియేటర్లలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 499కి, మల్టీప్లెక్స్‌లలో రూ. 799కి నాలుగు మందికి టికెట్‌తో పాటు ఒక పెద్ద పాప్‌కార్న్‌ను అందించే ఈ ప్యాకేజ్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. “4 ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీనే” అనే సందేశంతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు.

టికెట్ ధరల పెరుగుదల కారణంగా తగ్గిన కుటుంబాల థియేటర్ సందర్శనలను మళ్లీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న ప్రయత్నం చేశారు. మంచి కథతో పాటు అందుబాటు ధర ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారనే నమ్మకంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది.

Related Articles

Latest Articles