రామ్ చరణ్ ‘పెద్ది’ మ్యూజికల్ సెన్సేషన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు—వినసొంపైన మెలోడీ ‘చికిరి చికిరి’, అలాగే ఎనర్జిటిక్ మాస్ బీట్ ‘రై రై రా రా’—సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుని ఛార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.

రెండు భిన్నమైన మూడ్స్ ఉన్న ఈ రెండు పాటలు కలిసి ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్ (30 కోట్లకు పైగా వీక్షణలు) సాధించి రికార్డు సృష్టించాయి. సినిమా విడుదలకు ముందే మ్యూజిక్‌కు ఈ స్థాయి బ్రహ్మరథం పట్టడం, ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న అమితమైన ఆసక్తికి అద్దం పడుతోంది. మిగతా ఆల్బమ్ పై కూడా ఇది మరింత క్యూరియాసిటీని పెంచింది.

Related Articles

Latest Articles