నా సినిమాపై జగన్ ‘పేటీఎం బ్యాచ్’ కుట్ర – హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు

​తన తాజా సినిమాపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ నటుడు శివాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఫ్లాప్ అయిందని, మిక్స్డ్ టాక్ వచ్చిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా మాజీ సీఎం వైఎస్ జగన్ ‘పేటీఎం బ్యాచ్’ పన్నిన కుట్రగా ఆయన అభివర్ణించారు. మాజీ సీఎం జగన్ తన పేటీఎం బ్యాచ్ ద్వారా, సినిమా రిలీజ్ కావడానికి ముందే బాగోలేదంటూ రివ్యూలు రాయించారని మండిపడ్డారు. అయినప్పటికీ, తన సినిమా వారం రోజులకైనా ఖచ్చితంగా జనాలకు చేరువవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా సినిమాను ఆపగలరేమో కానీ, శివాజీని ఎవరూ ఆపలేరు. జగన్ సీఎంగా అధికారంలో ఉన్నప్పుడే నన్ను ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడు మాత్రం ఏం చేయగలరు?” అని ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా, సీబీఐ కేసులున్న వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కన పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరతానని శివాజీ స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles