ఉగాది కానుకగా 13 భాషల్లో రాబోతున్న ప్యాన్-గ్లోబల్ చిత్రం ‘ఖైగల్’ ఫస్ట్ లుక్ విడుదల

పవిత్రమైన ఉగాది పండుగను పురస్కరించుకుని ‘ఖైగల్’ చిత్ర బృందం పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అగ్ని, గందరగోళం మధ్య నెత్తురోడుతున్న యోధుడిగా ‘దేవ’ పాత్రలో హీరో జై సిద్ధార్థ్ లుక్ ప్రేక్షకులకు హై-వోల్టేజ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తూ అంచనాలను పెంచుతోంది.


జి.ఆర్ ప్రొడక్షన్స్, మరియు ఖైగల్ వారియర్స్ బ్యానర్లపై యశ్‌విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో సుష్మిత సింగ్, వాంశీ ఉదయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

హీరో జై సిద్ధార్థ్ 6’2″ ఎత్తు, అతని బేస్ వాయిస్ దేవ పాత్రకు ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకువచ్చాయని దర్శకుడు యశ్‌విన్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రియేష్ మోతుకూరి సంగీతం అందిస్తుండగా, దేవ్ దీప్ కుండు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్యాన్-గ్లోబల్ స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ‘ఖైగల్’ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జర్మన్, చైనీస్, జపనీస్ సహా మొత్తం 13 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles

Latest Articles