
టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు, మనీ రైన్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులలోకి ఎంతో పాజిటివ్గా వర్జిన్ బాయ్స్ చిత్రం చేరుకుంది. ఇప్పటికే ఈ విషయంపై మాకు అనేక ప్రాంతాల నుండి మంచి స్పందన లభించింది అంటున్నారు నిర్మాత రాజా దారపునేని. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ముందుగా ఏషియన్ సునీల్ నారంగ్ గారికి ధన్యవాదాలు ఉన్నారు. సునీల్ గారు తమ సినిమాను ముందుగానే ఎంతో నమ్మకంతో రిలీజ్ చేయడానికి తీసుకున్నారని దానికి గాను మనస్పూర్తిగా సంతోషిస్తూ సునీల్ గారికి ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు దయానంద్ తను అనుకున్న కథను మంచి క్వాలిటీతో తెరపైకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే చిత్రంలో నటించిన నటీనటులంతా తనకు ఎంత సపోర్ట్ చేసినట్లు తెలిపారు. కేవలం చిత్రంలో నటించడమే కాకుండా డబ్బింగ్ ఇంకా ఇతర ప్రమోషన్ వ్యవహారాలలో కూడా ఎంతో చురుకుగా పాల్గొంటూ సినిమాను తమ భుజాలపై వేసుకొని సపోర్ట్ చేసినందుకు నటీనటులందరికీ తన ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో నటించిన మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, బబ్లు, కౌశల్, జెనీఫర్, రోనీత్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ తదితరులంతా తనకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సినిమాను ముందుకు తీసుకెళ్లినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం ఎంతో అద్భుతమైన నిర్మాణ విలువలతో అన్ని జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఇంకా యూత్ కు నచ్చేలా ఉండబోతుందని అన్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఎంతో చురుకుగా ముందుకు వెళ్లడంతో మారుమూల ప్రాంతాల నుండి కూడా మాకు స్పందన లభిస్తుంది. సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. అలాగే మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈరోజు సినిమా టికెట్లు బుకింగ్స్ ఓపెన్ అవ్వటంతో ఎంతోమంది శరవేగంగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కొంతమంది థియేటర్లలో మనీ రైన్ పడితే తొక్కిసలాట జరుగుతుంది కదా, ప్రేక్షకులకు ఇబ్బంది అయితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుని ఎంతో ఆర్గనైజర్ గా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చబోతున్నాము. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ఇంకా విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. కేవలం ప్రేక్షకులు థియేటర్లకు రావాలని ఒక సదుద్దేశంతోనే మేము ఇటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకానీ దీనిలో ఎటువంటి తిరకాసు లేదు. ఓటిటిలో తర్వాత సినిమా వచ్చినప్పటికీ ముందుగా ప్రేక్షకులు ఇటువంటి చిత్రాలను థియేటర్లలో చూడాలని, థియేటర్లు బ్రతకాలని ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాము. మా ఆలోచనను ఆహ్వానించి ఎంతోమంది మెచ్చుకోవడం జరిగింది.
అయితే మిత్ర శర్మ గారు గతంలో ఎన్నోసార్లు ఎంతమంది పేదవారికి సహాయం చేసి అండగా నిలబడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే విధంగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా కొంతమంది పేదవారికి సహాయం చేశారు. బిగ్ బాస్ ఫేమ్ తో పాటు ఇప్పుడు ఆమెకు ప్రజలలో ఉన్న ఈ పాజిటివ్ ఒపీనియన్ కూడా సినిమా ప్రమోషన్ కు మరింత బలాన్ని అందించింది.
దయానంద్ రచనా దర్శకత్వంలో రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో బిగ్బాస్ ఫేమ్ మిత్ర శర్మ, గీతానంద్ జంటగా నటిస్తుండగా శ్రీహాన్, కౌశల్, రోనీత్, జెనీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లూ, అభిలాష్ తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ సినిమాకు ఎడిటింగ్ చేయగా అందించారు. వెంకటvప్రసాద్ సినిమాకు డిఓపి గా పని చేశారు.