
యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన గ్రామీణ ప్రేమకథ ‘ఉసురే’ సినిమా ఆగస్టు 1 నుంచి థియేటర్లలో విడుదల కానుంది. టీజే అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నవీన్ డి. గోపాల్ దర్శకత్వం వహించారు. బాఖియ లక్ష్మీ టాకీస్ బ్యానర్‌పై మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటి రాశి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికేట్ పొందింది. రొమాన్స్, కామెడీ, డ్రామా అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకనుంది.