
వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు
ప్రస్తుతం సినిమాలు విడుదలైన తర్వాత కూడా శాటిలైట్ ఇంకా ఓటిటి బిజినెస్ లు కష్టమవుతున్న ఈ సమయంలో శంబాల చిత్ర సాటిలైట్ ఇంకా ఓటిటి బిజినెస్ విడుదలకు ముందే విశేషం. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ జీ దక్కించుకోగా ఓటేటి రైట్స్ ను ఆహా దక్కించుకుంది. ఇప్పటికే ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకులలో ఎంతో బజ్ సృష్టించింది.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె బంగార్రి సినిమా ఆటోగ్రాఫర్ గా చేయగా శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ చేశారు. శంబాల డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది.
సాంకేతిక బృందం
బ్యానర్ : షైనింగ్ పిక్చర్స్
నిర్మాత : రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి
దర్శకుడు : యుగంధర్ ముని
సంగీతం: శ్రీచరణ్ పాకాల
DOP: ప్రవీణ్ కె బంగార్రి
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఫైట్స్ : రాజ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జెవి రామారావు
పీఆర్వో : సాయి సతీష్


