చిరంజీవి-వెంకటేష్ మెగా విక్టరీ మాస్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం కోసం అభిమానుల ఆత్రుత పెరిగిపోతోంది. అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడో సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డిసెంబర్ 30న విడుదల కానుంది. దీని ప్రోమో రేపు (డిసెంబర్ 27) విడుదల అవుతుంది.

సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో చిరంజీవి డెనిమ్ డ్రెస్‌తో సన్‌గ్లాసెస్‌లో ఎలిగెంట్‌గా, వెంకటేష్ రెడ్ జాకెట్‌లో స్టైలిష్‌గా డ్యాన్స్ పోజులతో డ్యాన్సర్ల మధ్య కనిపిస్తున్నారు. సెలబ్రేషన్ వైబ్స్‌తో నిండిన ఈ పోస్టర్ మాస్ అప్పీల్‌ను ప్రదర్శిస్తోంది.

ఈ సాంగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లకు పర్ఫెక్ట్ ఆంథమ్‌గా మారి మ్యూజిక్ చార్టులను షేక్ చేయనుంది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా భారీగా విడుదల కానుంది.

Related Articles

Latest Articles