
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం ఇప్పటికే ఎంతో ఆలస్యం అయినట్లు అర్థమవుతుంది. అయితే ఇటీవలే చిరంజీవి గారు ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం వెల్లడించినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు ఆయన తెలిపారని, అది కూడా జులై 10వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్త వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాకపోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విశ్వంభర చిత్ర విడుదల తేదీ చర్చనీయాంశం అయింది.


