
అరుణాచలంలోని పవిత్ర అన్నామలై కొండపైకి తమిళ బిగ్బాస్ 7 విన్నర్ అర్చనా రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్ వెళ్లారు. ఆ పవిత్ర ప్రాంతానికి ఎక్కిన వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో నిషేధిత ప్రాంతంలోకి వెళ్లారని అటవీశాఖ వారికి ₹5K ఫైన్ విధించింది. ఇది రిపీటైతే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. అటు కొండపైకి ఎక్కిన నటులపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.


